మహబూబ్ నగర్ : అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ ( Revanth Reddy) కు పాలన చేతకావడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) విమర్శించారు. పెబ్బేరు మున్సిపల్ ( Pebberu Muncipal Election) ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 3, 4, 5, 6 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కరుణశ్రీ,శంకర్ నాయుడు, పవిత్ర, అనురాధ, గోపిబాబు తరపున విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించి సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామని తెలిపారు. ఆంధ్రోళ్ల వెకిలి చేష్టలు,అవమానాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి , కేసీఆర్ కిట్టు, కంటివెలుగు, బతుకమ్మ చీరలు,ఆసరా పింఛన్లు విద్యార్థులకు విద్యా బరోసా అందించి సంక్షేమంలో ,అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని వెల్లడించారు. అందుకే మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే మున్సిపల్ ఎన్నికలలో విజయం నాంది కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమములో సమన్వయ కర్తలు లక్ష్మారెడ్డి, కర్రీస్వామి, దిలీప్ రెడ్డి, వనం రాములు, రాజశేఖర్, వడ్డే రమేష్ తదితరులు పాల్గొన్నారు.