మూసాపేట, డిసెంబర్ 1 : గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనంతోపా టు ఆర్థికంగా బలమమైనా వ్యక్తి అయి ఉండాలనే అన్వేషణ కొనసాగుతున్నది. ఏ గ్రామంలో ఏ వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఎవరైనా గెలిచే అభ్యర్థి ఉన్నాడా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హడావుడి చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎ న్నికలు నిర్వహిస్తామని ప్రకటనలు చేసి, మళ్లీ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎన్నికలు ని ర్వహించేందుకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై బీసీ వర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నది. మరి అధికార పార్టీ వర్గం అభ్యర్థుల కేటాయింపులో బీసీలకు అధికస్థానాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడాహుడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అభ్యర్థులు తగ్గెదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏవరెన్ని చెప్పినా నేనే గెలుస్తున్నాను.. కాబట్టి నామినేషన్ వేసి పోటీ చేసి తీరుతానని బహిరంగాంగానే కొంతమంది చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్లా ఇప్పటికే ఎవరికి వారు పార్టీ మద్దతు కోరుతూ మరో వైపు ప్రచారం మొదలు కూడా పెట్టారు. అయితే రెడ్డి వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. రెడ్డివర్గం వారు లేని గ్రామాల్లో జనరల్ కెటగిరీలకు సర్పంచ్ రిజర్వేషన్లు అమలు చేస్తూ, ఆశావాహులు ఉండి రెడ్డి వర్గం వారు అధికంగా ఉన్న చోట అక్కడ
ఇతర కేటగిరీలకు కేటాయించారని ఉ ద్దేశ పూర్వకంగానే తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆ వర్గం ఆశావాహుల్లో తీవ్ర ఆసంతృప్తి మొదలైంది. అంతే కాకుండా పార్టీ కోసం ఏండ్ల తరబడి పనిచేసిన వ్యక్తులకు రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదు. వారు కూడా అసంతృప్తి తో ఉన్నారు. కానీ ఆ పార్టీ పెద్దలు వారిని బుజ్జగిం చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమకు ప్రా ధా న్యం లేని చోట తాము ఎందుకు అన్నట్టుగా కొంత మంది అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది.
గత సంవత్సర కాలంలో పరిపాలన లోపాలతో రైతాంగ కుటుంబాలు అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నా
రు. ఆపార్టీకి ఓటు వేసి ఇబ్బందుల్లోకి పడ్డాం.. ఇక మీ దట మరో మారు ఓటు వేసి మోసపోకూడదని పల్లెల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వర్గాలు మాత్రం అధికారంలో ప్రభుత్వం ఉంది. అందుకని తమకు ఓటు వేయాలని, సామధాన దండోపాయాలు చే సేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అ యితే గత కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు మంచి జరిగినందనే సానూకూలత ఉంది. అం దుకని ఆ పార్టీ వర్గాలు గట్టి ప్రయత్నం చేస్తే చా లా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజ యం సాధించే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా ప్రజలు పార్టీలకు ప్రాధాన్య త ఇస్తారా లేదంటే అభ్యర్థులకు ప్రా ధాన్యత ఇస్తారనే విషయం కొద్ది రోజుల్లోనే తేలిపోనున్నది.