అచ్చంపేట, ఏప్రిల్ 20 : దోమలపెంట ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 58రోజులుగా రె స్క్యూ సిబ్బంది మృతదేహాల కోసం అన్వేషణ చేస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. టన్నెల్లో డేంజర్జోన్ అంటూ ఏర్పాటు చేసిన డీ-1, డీ-2 ప్రదేశం కంచె వరకు సహాయక పనులు కొనసాగుతున్నాయి. అక్కడ టీబీఎంకు సంబంధించిన స్టీల్, ఇసుప పరికరాలు కటింగ్ చేస్తున్నారు.
బండరాళ్లు, స్టీల్ పరికరాలు కటింగ్ చేసి లోకోట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. అ యితే డేంజర్ జోన్లో ఒకవైపున జాగ్రత్తలు తీ సుకుంటూ స్టీల్ కటింగ్ పనులు చేస్తున్నారు. పై నుంచి సిమెంట్ సెగ్మెట్లు కూలిపడిపోకుండా స పోర్టు పెట్టి జాగ్రత్తలు చేపట్టారు. భారీగా ఊటనీటిని అధిక సామర్థ్యం కలిగిన మోటర్ల ద్వారా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్కవేటర్లు, మినీ జేసీబీలు పనులు చేస్తున్నాయి. అయితే డేంజర్జోన్ పేర్కొన్న చివరి ప్రదేశానికి వెళ్లడం కష్టంగా మారింది.