అచ్చంపేట రూరల్, జూన్ 10 : నాటి కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ మానసపుత్రికగా పిలువబడిన హరితహారానికి శ్రీకారం చుట్టారు. రహదారు ల వెంట మొక్కలను నాటేందుకు గ్రామాలు, ము న్సిపాలిటీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి రూ.కోట్లు ఖర్చుపెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ వాటిని సంరక్షించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్నగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి, నడింపల్లి వైజంక్షన్తోపా టు ఉప్పునుంతల -హైదరాబాద్ రహదారిపై ఏపుగా పెరిగిన చెట్లను పదునైన రంపాలు, మిషన్ల సాయంతో నరికేశారు. కేసీఆర్ హయాంలో ఏటా జూన్, జూలైలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడితే.. కాంగ్రెస్ సర్కారు రావడంతోనే హరితహారం కార్యక్రమానికి పలు చోట్ల వి ఘాతం కలిగిస్తూ చెట్లను నరికేస్తున్నారనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏదైనా సరే.. ప్ర భుత్వాలు మారగానే అధికారుల వైఖరి మారడం అచ్చంపేటలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాధనంతో చేసిన పనిని నిర్వీర్యం చేయడంపై ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు గ్రామీణాభివృద్ధి శాఖ ఆ ధ్వర్యంలో రహదారులపై మొక్కలను నాటించగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. అయితే ఆయా గ్రామాలకు వెళ్లే విద్యుత్ స్తంభాల వైర్లకు అడ్డంగా ఉన్నాయనే కారణంతో సిబ్బంది జేసీబీలతో చెట్ల ను తొలగిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇదంతా జరుగుతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
మా శాఖ అనుమతి లేకుండా రహదారుల వెంట ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తే చ ర్యలు తీసుకుంటాం. నడింపల్లి వై జంక్షన్ స మీపంలో చెట్ల నరికివేతకు మా శాఖ నుంచి ఎలాంటి అనుమతులివ్వలేదు. మా సిబ్బంది ని ఘటనా స్థలానికి పంపించి.. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీపతి, రోడ్లు, రహదారులశాఖ సహాయ ఇంజినీర్