సన్న వడ్లకు మద్దతు కరువు
సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మ క్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థలు పడుతున్నారు.
- మార్కెట్ అధికారులు, వ్యాపారస్తుల కుమ్మక్కు
- ధాన్యం అమ్మకం కోసం రైతుల పడిగాపులు
- కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు అనాసక్తి
- బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం
- అయినా కేంద్రాలను తనిఖీ చేయని వైనం
- సమీక్షలతో కాలం వెల్లదీత
మహబూబ్‌నగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థలు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మేజర్ మార్కెట్లకు సన్న వడ్లు భారీగా వస్తున్నా యి. ఈ నేపథ్యంలో మార్కెట్లో ధాన్యం రేటు రోజురోజుకూ తగ్గేలా చేస్తున్నారు. గత వానకాలం సీజన్లో సన్న వడ్లకు రూ.3,300 అత్యధిక ధర పలికింది. ఈ సారి కూడా రూ.3,150 ధర ఉన్నప్పటికీ వ్యాపారస్తు లు సాకులు చెబుతూ తగ్గిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లను ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ఒక్క జడ్చ ర్ల మార్కెట్లోనే సుమారు 5,000 క్వింటాళ్ల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బుధవారం గ్రేడ్-1 ధాన్యానికి రూ.2,680 పలికింది. కానీ ప్రభుత్వం రూ.2,180 మ ద్దతు ధర ఇవ్వడంతో రైతాంగం మొత్తం బహిరంగ మా ర్కెట్ వైపు మొగ్గు చూపుతోంది. ఇటీవల ప్రభుత్వం కొనుగోళ్ల బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ఇచ్చినా మార్కెట్లోకి వస్తున్న ధాన్యం మాత్రం తమ పరిధిలోకి రాదన్న ట్టు వ్యవహరిస్తున్నారు. కేవలం సమీక్షలతోనే కాలం గడుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ధర ఉన్నప్పటికీ ఇటు వ్యాపారస్తులు.. అటు మార్కెట్ అధికారులు కుమ్మక్కు కావడంతో ధర లు తగ్గిస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా రు. మరోవైపు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు టెండ ర్లు వేసి కొనాల్సిన వ్యాపారస్తులు కాలయాపన చేస్తుండడంతో వర్షాలు పడి మార్కెట్లల్లో ఉన్న ధాన్యం మొ త్తం తడిసి ముద్దవుతుంది. తిరిగి ఆరబెట్టి అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారి.. సన్న వడ్లకు ధర లభించక రైతాం గం గోసపడుతోంది.
కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు..
వనపర్తి జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ఇప్పటివరకు 64,247.2 మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కొనుగోలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 202 కొనుగోలు కేంద్రాల ద్వారా 34.381.2 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 107 కేంద్రాల ద్వారా 2187.02 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 70 కేంద్రాలు ప్రారంభిం చి 9 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ఇప్పటి వరకు 2687.440 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మ హబూబ్‌నగర్ జిల్లాలో 110 కేంద్రాలు ఏర్పాటు చేసి 19,428.400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు.
మార్కెట్ల వైపు కన్నెత్తిచూడని కలెక్టర్లు
ఉమ్మడి జిల్లాలోని రైతులకు, వ్యాపారస్తులు సరైన ధర ఇవ్వకుండా మోసం చేస్తున్న విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోలు.. అమ్మకాల బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాల ద్వారా 90 శాతం వరకు వచ్చిన ధాన్యాన్ని కొనేశారు. కానీ సన్న వడ్లు మాత్రం ధర బహిరంగ మార్కెట్లో ఎక్కువ ఉండటంతో రైతులు ఆశగా మార్కెట్లకు తరలిస్తున్నారు. కాగా మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయకుండా వ్యాపారస్తులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అయినా కలెక్టర్లు మార్కెట్లను తనిఖీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం సొంత జిల్లాలోనే రైతులను దగా చేస్తున్నా పట్టించుకునే నాథు డే లేడని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
సన్న వడ్ల కొనుగోళ్లలో మాయాజాలం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కు కావడంతో బహిరంగ మార్కెట్లో లభిస్తున్న మద్దతు ధర గగనమైపోయింది. ఇటు వ్యాపారస్తులు అందరూ సిండికేట్‌గా మారడంతో గరిష్ఠ స్థాయికి చేరిన గ్రేడ్-1 ధాన్యానికి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని ప్రతిరోజూ పరిశీలించి వ్యాపారస్తులకు కమ్యూనికేట్ చేసి కొనుగోలు చేయించే బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉన్నా వారంతా వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లను వచ్చిన ధాన్యానికి గరిష్ఠ ధర ఇవ్వకుండా దగా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.3,100 పలుకుతున్న ధరలు కాదని రూ.2,680 చొప్పున తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. పక్కనే ఉన్న కర్ణాట క రాష్ట్రంలో అత్యధిక ధర పలుకుతుంటే సీఎం సొంత జిల్లాలో మాత్రం వ్యాపారస్తులు, అధికారు లు కుమ్మక్కై రోజురోజుకూ ధరలు తగ్గిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముం చుతున్నాయి. ధాన్యం తడిసిపోతుండడంతో కనిష్ఠ స్థాయికి ధరలు పలుకుతున్నాయి. ఇక మార్కెట్లలో ఆరబెట్టుకొని అమ్ముకుందామంటే వసతులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు
బియ్యం ధరలు ఆకాశంలో ఉన్నాయి. మేము పండించిన పంటకు మాత్రం సరైన ధర రావడం లేదు.. కిలో సన్న బియ్యం రూ.60 ధర పలుకుతుంది. సూపర్ మార్కెట్లలో రూ.70 ఉన్నది. ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్‌కు విక్రయించేందుకు తీసుకెళ్తే క్వింటాకు రూ.2,600 మాత్రమే చెల్లిస్తున్నారు. మాకు చాలా నష్టం కలుగుతుంది. పంటలు కోయగానే ఆరబెట్టి తీసుకెళ్లిన కొనుగోళ్లకు టైం తీసుకుంటున్నారు. వర్షాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా సన్న వడ్లకు మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయాలి.
– గౌని చెన్నయ్య, రైతు, మహబూబ్‌నగర్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

