మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 29 : పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ) మొదటి విడుత సీట్ల కేటాయింపు గు రువారం పూర్తయ్యింది. తొలి విడుతలో మొత్తం 3,358 మందికి మాత్రమే సీట్లు కేటాయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా దోస్త్ ఆన్లై న్ ప్రక్రియలో 69 కళాశాలల్లో మొత్తం 30,820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మొదటి విడుతలో నాలుగో వంతు సీట్లు కూడా భర్తీ కాలేదు. మొత్తం 30 వేలకుపైగా సీట్లు ఉండగా.. కేవలం 3 వేల మందికిపైగా విద్యార్థులే పొందారు.
25 శాతం డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఒక్క విద్యార్థి ముందుకు రాలేదు. మొదటి విడుతలో సీటు పొందిన అభ్యర్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని పీయూ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చంద్రకిరణ్ తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత అవసరమైతే రెం డో విడుతలో మరింత మెరుగైన సీటు కోసం ప్ర యత్నించవచ్చని, జూన్ 6వతేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే.. సీటు కోల్పోతారని స్పష్టం చేశారు. మొదటి ఫేజ్‌లో కళాశాలల్లో సీటు పొందిన విద్యార్థులు వెంటనే సంబంధిత కళాశాలలను సంప్రదించాలని కోరారు.
పీయూ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదవడానికి 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రక్రియ కొనసాగుతున్నది. ఇంటర్లో ఉత్తీర్ణులై డిగ్రీ చదవాలనుకునే వారి కోసం ఈ నెల 30 నుంచి రెండో విడుత ప్రారంభం కానున్నది. ఈనెల 30 నుంచి జూన్ 8వ తేదీ వరకు రూ.200 నిర్ధేశిత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు ప్రధానంగా విద్యార్థుల మొబైల్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసి ఉం డాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం విద్యార్థుల మొ బైల్ నెంబర్లకు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేష న్ ప్రక్రియ పూ ర్తవుతుంది. జూ న్ 13న సీట్ల కేటాయింపు ఉండనుండ గా.. జూన్ 18న రిపోర్టింగ్‌కు తుది గడువుగా అధికారులు పేర్కొన్నారు.
– డాక్టర్ చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, పీయూ