గద్వాల, జూన్ 18 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ప్రాజెక్టుకు 3, 807 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అవుట్‌ఫ్లో 2,88 1 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.949 టీఎంసీలకు చే రుకున్నది. నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 810 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, లిఫ్ట్-2కు 84 4 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 966 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నారు.
అయిజ, జూన్ 18 : ఆర్డీఎస్ ఆనకట్టకు మంగళవా రం 2,357 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 2,357 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 8.4అడుగుల నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 770 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,752 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాంలో ప్రస్తుతం 5.979 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారి రాఘవేంద్ర తెలిపారు.