మూసాపేట, జూన్ 8 : పారిశ్రామిక వాడగా దేవరకద్రను అభివృద్ధి చేస్తానని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని వేములలో ఫార్మా పరిశ్రమ నిర్మాణంలో భాగంగా గురువారం చేపట్టిన భూమిపూజకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బా లరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ రవినాయక్‌తో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ నాయకులు మూసాపే ట స్టేజీ నుంచి జాతీయ రహదారి మీదుగా పరిశ్రమ వరకు బైక్‌ల ర్యాలీతో స్వాగతం పలికారు. అదేవిధంగా వేముల వద్ద రూ.500 కో ట్లతో నిర్మించనున్న ఎస్జీడీ కార్నింగ్ కంపెనీ యూనిట్-2కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పండుగ సమయంలో ఇండ్ల ముందుకు గంగిరెద్దులొచ్చినట్లు.. ఎన్నికల సమయంలో ఓట్లకోసం వచ్చే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.
రాష్ట్రంలోని మంచి ఎమ్మెల్యేల్లో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మరింత మంచి ఎమ్మెల్యే అని కొనియాడారు. 2014కు ముందు వర్షాలు బాగా కురిసి చె రువులు నిండితే.. 40వేల ఎకరాలు సాగవగా.. ఆల ప్రయత్నంతో నేడు 90వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రశంసించారు. కరివెన పూర్తయితే ఈ ప్రాం తంలో కరువు అనే పదం బూతద్దం పెట్టి వెతికినా కనిపించదన్నారు. అందిరికీ సర్కార్ కొలువులు ఏ రాష్ట్రం, దేశంలో కూడా సాధ్యం కాదని.. అందుకే ఉపాధిని పెంచేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని వివరించారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆల దేవరకద్రను ము న్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని, భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీలకు నిధులు కేటాయించాలని, దేవరకద్ర, కొత్తకోటలో రెండు దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరగా.. మంత్రి స్పందిస్తూ త్వరలోనే మంత్రి హరీశ్‌రావు వచ్చి దవాఖానల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కరువు, వలసలు, పేద జిల్లాగా వెనుకబడిన పాలమూరు జిల్లాపై నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అం దుకే దేశంలో అతి పెద్ద పరిశ్రమలను పాలమూరులో ఏర్పాటు చేయిస్తున్నట్లు గుర్తు చేశారు.
“తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగేందుకు నీళ్లు లేకుండె. సాగునీరైతే కనిపించకపోయేది. రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది. 50 ఏండ్లు పాలించిన పాలమూరుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు.. అలాంటి పార్టీ ఇప్పుడు దీవాలా తీసినట్లయ్యింది” అని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. యువతకు యువనేత, మంత్రి కేటీఆర్ స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న మంత్రి కేటీఆర్ అని.. ఇలాంటి మంత్రి దేశంలో మరెవ రూ లేరన్నారు. పరిశ్రమల ఏర్పాటులో దేవరకద్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మం త్రిని కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరూపమే మారిపోయిందని, మన ప్రాంతానికే వలసలొచ్చే స్థాయికి ఎదిగామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, ఎంపీపీలు నాగర్జునరెడ్డి, కళావతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్లు జితేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.