జడ్చర్ల, జనవరి 23 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు శుక్రవారం రికార్డుస్థాయిలో క్వింటా రూ.10,280 ధర పలికింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇంతపెద్ద మొత్తంలో వేరుశనగకు ధరలు రాలేదు. గురువారం మార్కెట్లో అత్యధికంగా క్వింటా రూ.9,865ధర పలుకగా శుక్రవారం క్వింటా రూ.10,280 ధర పలికింది. అంటే రూ.415 అధికంగా వచ్చాయి.
మార్కెట్కు 1,679క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా దానికి గరిష్ఠంగా క్వింటా రూ.10,280 ధర పలుకగా కనిష్ఠంగా రూ. 7,560, మధ్యస్తంగా క్వింటా రూ.9,369 ధరలు పలికాయి. అదేవిధంగా కందులకు గరిష్ఠంగా క్వింటాకు రూ.7,801, కనిష్ఠంగా రూ. 5,766, మధ్యస్తంగా రూ.7,511, మొక్కజొన్నకు గరిష్ఠంగా క్వింటా రూ.1,921ధర పలికింది. ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి గరిష్ఠంగా క్వింటాకు రూ.2,752 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.