2023-24 వానకాలం సీజన్‌కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,171 మెట్రిక్ టన్నులు తిరిగి ఇచ్చారు. ఇంకా 7,182 మెట్రిక్ టన్నులు బకాయీ ఉన్నారు.
2023-24 యాసంగి సీజన్‌కుగానూ 52,347 మెట్రిక్ టన్నుల ధాన్యం 36 మిల్లులకు కేటాయించారు. ఇందుకు 35,522 మెట్రిక్ టన్నులు బియ్యం తిరిగి చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 17,480 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 18,041 మెట్రిక్ టన్నుల బకాయీ ఉంది.
ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం యజమానులు అక్రమార్జన కోసం ఇతర రాష్ర్టాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నా రు. తనిఖీలు, దాడులు చేసే అధికారులు నిర్లిప్తంగా ఉండటంతో ధాన్యం రాష్ట్రం దాటిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2022-23లో ధాన్యం పక్క రాష్ర్టాలకు తరలిపోగా.. ఆలస్యంగా మే లుకొన్న అధికార యత్రాంగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు కొన్ని నెలల కిందట మిల్లులపై దాడులు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,002 మెట్రిక్ టన్ను ల ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై నామమాత్రంగా చర్యలు తీసుకొని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నిసార్లు గడువు పెంచినా.. మిల్లర్ల వద్ద ధాన్యమే లేకపోతే ప్రభుత్వానికి ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, సె ప్టెంబర్ 23 : మహబూబ్‌నగర్ జిల్లాలో 2023-24 (వానకాలం-యాసంగి) సీజన్లో సేకరించిన ధా న్యం మర ఆడించి సీఎంఆర్ రూపకంగా తిరిగి బియ్యాన్ని అప్పగించేందుకు మిల్లర్లకు పౌరసరఫరాలశాఖ అప్పగించింది. ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వానికి ఇచ్చేందుకు గడువు ఉన్నది. అయితే ఈ సమయం 8 రోజులే ఉండగా నేటికీ సీఎంఆర్ బియ్యం 25,223 మెట్రిక్ టన్నులు అప్పగిస్తారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువులోగా అందించడం కష్టమేనని పలువురు పే ర్కొంటున్నారు. 2022-23 యాసంగి సీజన్‌కు గానూ మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని అల్లీపూర్ లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్‌కు 3,002 మెట్రిక్ టన్నుల ధాన్యం (దాదాపు రూ.9 కోట్లకుపైగా..) కేటాయించగా.. ఆ ధాన్యం పక్కదారి పట్టింది. ఈ నేపథ్యంలోనే 2023-24 రెండు సీజన్లలో ప్రభుత్వానికి రావాల్సిన సీ ఎంఆర్ బియ్యం భారీగా పెండింగ్ లో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
రూపాయి పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే ధాన్యం ఇవ్వడం మర ఆడించిన తర్వాత 67 శాతం బియ్యం మాత్రమే తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉండడంతో మిల్లు యజమానులకు బియ్యం వ్యాపారం కాసులు కురిపిస్తుంది. ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగో లు చేసి మిల్లర్లకు మర ఆడించి ఇవ్వడానికి ఉచితంగా ఇస్తుండటంతో ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. ఈ సీజన్లో ఇచ్చి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సదరు ధాన్యాన్ని ఇతర రాష్ర్టాలకు విక్రయించుకుంటూ సొ మ్ము చేసుకుంటున్నారు. చూస్తుండగానే మరో సీజన్ రావడం ప్రభుత్వం మళ్లీ ధాన్యం ఇవ్వడం.. ధాన్యాన్ని మర ఆడించి కొంత మేరకు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వ డం, మరి కొంత పెండింగ్‌లో పెట్టడం ఇలా వరుసగా చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని లక్ష్మీనరసింహాస్వామి ఇండస్ట్రీస్ యాజమాన్యం రూ.9.43 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నది. అలా ఇవ్వ ని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జా మీను ఉన్న వారి ఆస్తుల ను జప్తు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే క్రిమినల్ కేసు నమో దు చేశాం. గడువులోపు సీఎంఆర్ చెల్లించకుంటే ప్ర భుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంలో నూటికి 125 శా తం జరిమానాతో వసూలు చేయనున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.
– విక్రమ్, పౌరసరఫరాల సంస్థ ఇన్చార్జి డీఎం, మహబూబ్‌నగర్