ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ నూతన ఎస్సై గా (Ootkur SI ) వి. రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా వీఆర్ లో పనిచేస్తూ ఊట్కూర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న కృష్ణంరాజు నారాయణపేట వీఆర్‌కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై కృష్ణంరాజును పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు (Law and Order) పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.