పెబ్బేరు, జూన్ 18 : అనుకున్న సమయానికి వర్షాలు కురవకపోవడంతో తాగునీటి సమస్యను అ ధిగమించేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. జూన్ మాసం ఆరంభమై ఇరవై రోజులు కావొస్తున్నా.. నై రుతి రుతుపవనాల జాడ కనిపించకపోవడంతో రై తాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యం లో మొదట తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలకు పూనుకున్నారు. జిల్లాలోని రామన్‌పాడు జలాశయం నుంచి జూరాల ఎడమకాల్వ ద్వారా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీళ్లొదులుతున్నారు. గో పల్దిన్నె రిజర్వాయర్‌లో నీళ్లు అడుగంటి పోయి మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రామన్‌పాడు నుంచి విడుదలైన నీరు పెబ్బేరు మండలం గుండా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు తరలివెళ్తున్నా యి. ఈ విషయమై జూరాల ఈఈ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ కేవలం తాగునీటి కోసమే నీటిని వ దులుతున్నామని.. రైతులు సాగు కోసం ఈ నీటిని ఉపయోగించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి కోసం ఇంకా నీ టిని విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు.