అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) ఏదో ఒక సందర్భంగా తెలంగాణను, హైదరాబాద్‌ను తలుచుకుంటూనే ఉన్నారు. తానే హైదరాబాద్‌ను అభివృద్ధి పరిచానని పదేపదే చెప్పుకుంటున్న ఆయన ఈసారి తీవ్రవాదుల (Terrorists ) వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు డిజిటల్ పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తీవ్రవాదుల పైన నేను పోరాడాను
హైదరాబాద్ చుట్టుపక్కల అంతా తీవ్రవాదులు ఉన్నందుకు నగరం అభివృద్ధి చెందలేదు
ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పు అన్నందుకు తిరుపతిలో నా మీద తీవ్రవాదులు బాంబు ఎటాక్ చేశారు – చంద్రబాబు నాయుడు pic.twitter.com/JzC2U2dYrJ
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2026
నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన తాను రాజధానిని అభివృద్ధి చేయాలంటే చుట్టూ తీవ్రవాదులు ఉన్నారని వెల్లడించారు. తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరితే తిరుపతిలో తనను లక్ష్యంగా చేసుకుని 24 క్లైమర్మెన్లను పేల్చి చంపాలని ప్రయత్నించారని అన్నారు. ఆ వేంకటేశ్వరస్వామి సాక్షాత్తు దిగివచ్చి తనను రక్షించారని తెలిపారు.