Mega Movies | సంక్రాంతి 2026 సీజన్లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టంతా సమ్మర్ సీజన్‌పై పడింది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ వరుసగా వేసవి విడుదలలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే సమ్మర్ 2026పై మెగా ఫ్యామిలీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు మెగా కుటుంబం నుంచి విడుదలకు రెడీ అవ్వడం విశేషం. అందులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి టాప్ హీరోల సినిమాలు కూడా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సమ్మర్ సీజన్‌కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఉన్న ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫాంటసీ–హారర్ కామెడీ జానర్లో రాబోతోంది. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమయం మొదలవుతుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి హైప్ ఉంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఈ చిత్రం సమ్మర్ హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా ఫాంటసీ డ్రామా భారీ గ్రాఫిక్స్‌తో జూలైలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా నిలిచే అవకాశమున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ కూడా సమ్మర్ బరిలోకి దిగుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్లో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఇలా ఒకే సమ్మర్ సీజన్లో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా ఐదు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్లో అరుదైన విషయంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ మెగా సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో, ప్రేక్షకులు ఏ చిత్రానికి ఎక్కువ ఆదరణ చూపిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేసవి నిజంగా “మెగా సమ్మర్”గా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.