రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటుగా గుర్తొచ్చేది హలీమ్…, ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీమ్ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్‌గా మారిపోయింది. రుచితో పాటుగా పౌష్టికత కలిగిన ఈ హలీమ్ లొట్టలు వేసుకుంటూ రుచులు చూస్తున్నారు. దీంతో సాయంత్రం వేళల్లో ఉమ్మడి జిల్లాలోని బేకరీలు, టీ హోటళ్ల వద్ద హలీమ్ కేంద్రాలు వెలిశాయి. కులమతాలకతీతంగా హలీమ్ రుచి చూ సేందుకు అందరూ ఇష్టపడుతారు.
ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో రుచికరమైన హలీమ్ టేస్టీని ఆస్వాదించేందుకు వచ్చిన వారితో సాయంత్రమైతే చాలు కేంద్రాలన్నీ సందడిగా మారుతున్నాయి. ఈ వంటకాన్ని అరేబియన్స్ మనకు పరిచయం చేశారు. చికెన్‌తో వంటకాన్ని హర్రీస్ అని.. మటన్‌తో చేసే వంటకాన్ని హలీమ్ అంటారు. దీన్ని తయారు చేయడానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
కేలరీలు అధికంగా ఉండే ఈ వంటకం ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు తక్షణ శక్తిని కలిగిస్తుంది. ఇందులోని పీచు పదార్థం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ చేర్చడం తో శరీరానికి మేలు కలుగుతుంది. ప్రతి 100 గ్రాముల హలీమ్‌లో 157 క్యాలరీలు, 9.7 గ్రాముల ప్రోటీన్, 6.86 గ్రాముల కొవ్వు పదార్థం, 15.2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటా యి. విటమిన్ ఏ, ఈలు, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. ఒక్క హలీమ్ ధర రూ.100 నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఆయా ప్రాంతాలలో ఒక్కో రేట్‌కు విక్రయిస్తున్నారు. ఇంత శ్రేష్టమైనది కాబట్టే ఈ వంటకాన్ని రుచి చూసేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు.