మూడ్రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాను ముసురు ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు లేకుండా ముత్యాలు రాలినట్లు జడివాన కురుస్తున్నది. సంతోషంతో రైతులు పొలం పనులు చేస్తున్నారు. వరి కరిగేట్ల పనుల్లో బిజిబిజీగా ఉన్నారు. ఇతర పంటలను సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్ట పంటలకు మందులు కొడుతూ సందడిగా కనిపిస్తున్నారు. పొలం పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి కూలీలు తరలివస్తున్నారు. పాటలు పడుతూ పనులను ఉత్సాహంగా చేస్తున్నారు.
ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలో మహిళా కూలీలు, రైతులు ముసురు వర్షంలో వరి నాట్లు వేసేందుకు తలపై కవర్లు కప్పుకొని వేయడానికి తలపై కవర్లు కట్టుకొని చేతిలో సద్దిమూట పట్టుకొని పొలాలకు వెళ్తున్న దృశ్యాలు ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది..
– యాదిరెడ్డి, వనపర్తి ఫొటోగ్రాఫర్