మహబూబ్నగర్ : జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తడిఆరిన భూమితో పలు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు, సైడ్వాల్స్ కుప్పకూలుతున్నాయి. అయితే ఇటీవల కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ( Railway under Bridge ) పనుల్లో భాగంగా సైడ్వాల్ కూడా నేలమట్టమయ్యింది.
ఉందా నగర్ నుంచి మహబూబ్ నగర్ వరకు రైల్వే డబుల్ లైన్ నిర్మించారు. ఈ లైన్ కూడా ప్రారంభం కావడంతో పాటు రైళ్లు కూడా నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి నుంచి ఎదిర మార్గంలో రైల్వే అధికారులు ఆర్ఓబీ ని నిర్మించగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి అప్పనపల్లి దగ్గర ఉన్న రైల్వే అండర్ పాస్ సైడ్ వాల్ ( Sidewall ) ఒక్కసారిగా అర్ధరాత్రి కూలిపోయింది. అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో రైళ్ల రాకపోకల వేగాన్ని తగ్గించి రైళ్లను నడుపుతున్నారు.