Jadcherla | జడ్చర్ల, జూన్ 3 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్య క్రమంలో భాగంగా వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు అందజేయడం జరిగింది. మంగళవారం చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి రైతు వేదిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరి, జొన్న, కంది, విత్తనాలను రైతులకు అందించటం జరిగింది.
ఈ సందర్భంగా 31 మంది రైతులకు వడ్ల బస్తాలు, ఒక్క రైతుకు 10 కేజీ బస్తా చొప్పున ఇవ్వటం జరిగింది. 31 మంది రైతులకు కందులు, ఒక్క రైతుకు 3 కేజీల బస్తా చొప్పున ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 31 మంది రైతులకు జొన్నలు, ఒక్క రైతుకు 3 కేజీ బస్తా చొప్పున ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం సరఫరా చేసిన ఈ నాణ్యమైన విత్తనాలను పండించి రైతులు మార్కెట్లో అమ్మకుండా ఇతర రైతులకు సరఫరా చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్త సి హెచ్ బాలచందర్, జడ్చర్ల మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్, వ్యవసాయ విస్తరణ అధికారులు నవనీత, శారద, సంతోష, AMC డైరెక్టర్ యాకుబ్, నిత్యానందం , బూర్ల వెంకటయ్య, మాచారం బాల్ రెడ్డి, సాయి రెడ్డి, అశోక్ యాదవ్, అంజి రెడ్డి , లక్ష్మన్ రావు, నర్సింహులు , వివిధ గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.