Narayanpet | ఊట్కూర్, జూన్ 05: బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడి ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్‌తో పాటు సన్న బియ్యంతో వండిన మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తామని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుందని, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లు నిండిన అంగన్వాడి పిల్లల పేర్లను బడిలో చేరేందుకు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.