కొత్తకోట : అక్రమ అరెస్టులతో ప్రజావ్యతిరేకతను అడ్డుకోలేరని బీఆర్ఎస్వీ (BRSV) వనపర్తి జిల్లా నాయకులు కే శ్రీనివాసులు అన్నారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా అసెంబ్లీ ( Assembly) ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్లకుండా పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కొత్తకోట బీఆర్ఎస్వీ నాయకులు వికాస్, మహేష్, రాజకుమార్, రవికుమార్, చంద్రశేఖర్, శివ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.