నాగర్‌కర్నూల్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జెడ్పీ చైర్మన్ శాంతకుమారి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెఢ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సుదినమన్నారు. తెలంగాణ వచ్చాక 60శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వ డం జరిగిందన్నారు. కృష్ణా-గోదావరి జలాల్లో వాటా తేల్చని కేంద్రం, రెండు రాష్ర్టాల మధ్య అగాధం తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగుల పంపిణీకే ఏడాది గడిచిందన్నారు.
దీనివల్లే తొలుత ఉద్యో గ నోటిఫికేషన్లలో జాప్యం ఏర్పడిందన్నారు. పాలన ప్రజలకు చేరేందుకు కొత్త జిల్లాలు, స్థానికులకే ఉద్యోగాల కోసం కొత్త జోనల్ పద్ధతిని తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసినట్లు చెప్పారు. శతాబ్దాల భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపమైన వీఆర్ఏలను ఆత్మగౌరవం గల ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. మెటర్నటీ సెలవులు లేని దయనీయ స్థితిలో వీఆర్ఏ వ్యవస్థ ఉండేదన్నారు. ఈ క్రమంలో వీఆర్ఏల రెగ్యులరైజేషన్‌లో సీఎం కేసీఆర్ మానవీయ దృక్పథాన్ని చూశారన్నారు. తెలంగాణవచ్చాక ప్రతిభను నమ్ముకొని, పైరవీలకు తావులేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగిందన్నా రు. రాష్ట్రంలో 9.50లక్షల మంది ప్రభు త్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఇది దేశంలోనే అత్యధికం అని అన్నారు. ఇక ఆర్థిక వృద్ధి రేటులో, కరెంట్ సరఫరాలో, నెలవారీ జీతాల్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
ఇక గత యాసంగిలో వరి పంట దేశంలో 94లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 54 లక్షల ఎకరాల్లో పండించడం గర్వకారణమన్నారు. వీఆర్ఏలు, ప్రజలు తెలంగా ణ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలన్నా రు. వీఆర్ఏలకు నియామక ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సుదినం, మరిచిపోలేని రోజు అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదన్నారని, ఎన్నో ఉద్యమాలు, అవమానాలు పడి రాష్ట్రం సాధించుకున్నది ఇ లాంటి రోజు కోసమే అని అన్నారు. రాష్ట్రం లో 23వేల మంది వీఆర్ఏలు రెగ్యులర్ అవుతున్నారన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పేదల పట్ల అభిమానం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శాంతకుమారి, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, ఆర్డీవోలు, తాసీల్దార్లు, వివి ధ శాఖల అధికారులు, వీఆర్ఏలు తది తరులు పాల్గొన్నారు.