బాలానగర్, మార్చి 7 : ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంయుక్త కార్యదర్శి ఎఫ్ శివానంద్ బచ్చగుండి అన్నారు. శుక్రవారం ఆయన బాలానగర్ ఈఎంఆర్ఎస్ (ఏకలవ్య) గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలోని తరగతి గదులు, విద్యార్థుల వసతిగృహాలు, భోజనశాల, క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు.
కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా నడుస్తున్న బాలానగర్ ఈఎంఆర్ఎస్ గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజనం తదితర అంశాలకు సం బంధించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను గురించి గురుకులం సుభాష్‌చంద్ర శుక్లా ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ఈఈటీ, జేఈఈ ఫలితాలపై కూడా ఆరా తీశారు. ఆయన వెంట రాష్ట్ర ఈఎంఆర్ఎస్ సొసైటీ అధికారులు రామారావు, వీర్యానాయక్, ఏకలవ్య గురుకులం ఓఎస్డీ లక్ష్మారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.