రాజోళి, నవంబర్ 16 : తుంగభద్ర నది తీరాన ఉన్న రాజోళి మండలంలోని గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక సమస్యతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే అ సలు ఇసుక సమస్య వచ్చేది కాదని ప్రజలు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్రమ దం దాకు శ్రీకారం చుడుతూ సామాన్య ప్రజలపై భా రం మోపుతున్నారు. తుంగభద్ర నదిలో వరద కొనసాగుతున్న రాత్రి వేళల్లో మాత్రం డ్యాం గేట్లు బంద్ చేయించి మరి అక్రమ దందా చేస్తున్నారు.
స్థానిక ప్రజలు ఒక ఇసుక ట్రాక్టర్ రూ.5500 కొనవలసిన పరిస్థితి ఎదురవుతుందని అధిక ధరలకు కొనలేక ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఎండ్ల బండ్లతో ఇసుకను తరలిస్తే ఎలాం టి అనుమతులు అవసరం లేదని వారిని అక్రమ ఇసుక తరలింపునకు ఉపయోగిస్తూ అక్రమ ఇసుకాసురులు ఎక్కువ ధరలకు వారితోనే కొనుగోలు చేసి వాటిని డంపులుగా పోసుకొని ఇసుక అవసరమైన వ్యక్తులకు ఇవ్వకుండా బయటి గ్రామాల్లో అధిక ధరలు వస్తాయని అమ్ముకుంటున్నారు. ప్ర జలు ఎడ్ల బండ్ల వారిని ఇసుక కావాలని కోరిన గె ట్ల దగ్గర వేస్తేనే మాకు రూ.500 వస్తున్నాయి. మీ కు ఇసుక కావాలంటే రూ.1000 ఇవ్వాల్సిందే అంటూడిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎద్దుల బండ్లు రాక అధిక ధరలకు ఇండ్ల నిర్మాణం చేయలేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తున్న ఆన్లైన్ ఇసుక బుక్ చేసుకున్న ఇసుక రీచ్‌లను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఇసుక రావడం లేదని వాపోతున్నారు.
తుంగభద్ర నదికి అదివారం ఇసుక కోసం వెళ్లిన ఎడ్ల బండ్లను పోలీస్ అధికారులు అడ్డుకోవడంతో రాజోళిలోని ప్రధాన రహదారిలో వాహనా ల రాకపోకలను సైతం అడ్డుకొని నిరసనలు తెలిపారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోని అధికారులు ఎడ్లబండ్లను ఎందుకు అడ్డుకుంటారని బతుకుదెరువు కోసం ఇసుక తరలిస్తూ జీవనం సాగిస్తున్నామని ఎడ్ల బండ్లను అడ్డుకోవడం తగదని రెండు గంటల పా టు నిరసనకు దిగారు. ఎస్సై గోకారి ఘటనా స్థలానికి చేరుకొని ఎడ్లబండ్ల వ్యక్తులతో మాట్లాడుతూ మీరు నదిలో ఇసుక తెచ్చి డంపులు పోసి అక్రమదందా చేసేవారికి అమ్మడం వల్లే స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీంతో వారు శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇంటి నిర్మాణం చేయాలని భూమి పూజ కార్యక్రమాలు చేశాను. రాజోళి ఇసుక సమస్యపై ఆలోచిస్తు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఎడ్ల బండ్లను అడిగిన ఒక బండి రూ. 1000 చెబుతున్నారు. అక్రమ ఇసుక దందా వ్యక్తుల ధరలతో ఇళ్లనిర్మాణం చేయాలంటే భయం వేస్తుంది. అధికారుల ప్రజా పమస్యలపై అలోచించి అక్రమ దం దాను అరికట్టి ప్రభుత్వ అనుమతులున్న రీచ్‌ల ద్వారానే మాత్రం ఇసు క సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజల సమస్యలు తీరుతాయి.
– కోంకతి రాము, రాజోళి గ్రామస్తుడు