మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 19 : గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని మైనారిటీ బాలుర-2 గురుకుల విద్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మైనార్టీ గురుకుల విభాగ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ షేక్ జావిద్ మాట్లాడుతూ అశాస్త్రీయంగా ఉన్న టైంటేబుల్ గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెం చుతోందని వాపోయారు. వెంటనే టైం టేబుల్ మార్చాలన్నారు. గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్, గురుకుల జేఏసీ సంయుక్తంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా గురుకులాల్లో నాణ్యమైన ఆహా రం అందించేందుకు డైట్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల తో రోజూ రాత్రి 9 గంటల వరకు పనిచేయించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఆ సమయం వరకు పనిచేస్తున్నారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కిష్టయ్య, మైనార్టీ బాలుర-2 గురుకుల ఇన్చార్జి ప్రిన్సిపాల్ లుబీనా వహీదా అలీ జాబ్రి, రమా, అత్తర్జబీన్, తయ్యబా ఫిర్దోస్, సునీత, మహేశ్‌బాబు, అలీ అహ్మద్, షాహీన్, ఇస్రత్, విక్టోర్ ఆర్నాల్డ్, వెంకటమ్మ, వెంకటేశ్వ ర్లు, వెంకట్రాములు, సుల్తానా, శ్రీను, మమత, నాగరాణి, అరుణ, రమాదేవి పాల్గొన్నారు.