గద్వాల, జూన్ 22 : ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మురిసిపోతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎ గువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా పెరుగు తూ వస్తున్నది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టిమట్టం 9.657 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యం ఉండగా వారంరోజులుగా వస్తున్న వరద తో ప్రస్తుతం 8.869 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది. ముందస్తుగా ప్రాజెక్టుకు వరద వచ్చి చే రుతుండడంతో అధికారులు ఎత్తిపోతల పథకా లు ఆన్‌చేసి రిజర్వాయర్లను నింపే ప్రయత్నం చే స్తున్నారు. ఇప్పటికే నెట్టెంపాడ్ లిఫ్ట్ ఆన్ చే యగా, భీమా, కోయిల్‌సాగర్, జూరాల కుడి ప్ర ధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ముందస్తుగా జూరాల ప్రాజుక్టుకు వరదలు రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులు సంబురంగా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు జూరాల ప్రాజెక్టు వరప్రదాయినిగా నిలుస్తున్నది. ఇటు కాల్వలు, అటు ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయా జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు అందించడంలో జూరాల ప్రాజెక్టు పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు కింద సుమారు లక్షా రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. జూ రాల కుడి కాల్వ 46కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ 35వేల ఎకరాలకు, ఎడమ కాల్వ వంద కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ 67వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. కుడి కాల్వ జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీరు అందుతుం టే, ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, మక్తల్, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి పథకాలకు నీటిని తీసుకుంటున్నారు. కుడి కాల్వపై జములమ్మ రిజర్వాయర్, ఎడమ కాల్వపై రామన్‌పాడ్, గోపల్‌దిన్నె రిజర్వాయర్లు ఆధారపడి ఉన్నాయి. వేసవిలో డెడ్‌స్టోరేజ్‌కు పడిపోయిన జూరాల ప్రాజెక్టు ఆదివారం నాటికి 8.869 టీఎంసీలకు చేరుకోవడం తో 90శాతం నిండినట్లయ్యింది. జూరాల ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురువడంతో జూరాలకు వరద వచ్చి చేరుకుంటుంది. వారం రోజులుగా వరద కొనసాగుతుండడంతో జూరాల నిండుకుండలా మారింది.
వారంరోజులుగా జూరాలకు స్థిరంగా వరద వచ్చి చేరుతుండడంతో నెట్టెంపాడ్ లిఫ్ట్‌ను ప్రా రంభించారు. దీంతో పాటు భీమా-1, కోయిల్‌సాగర్, జూరాల కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. జూరాలకు మరో ఒక టీఎంసీల వరద వస్తే పూర్తి స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఈ వానకాలం సాగుకు ఎటువంటి నీటి ఢోకా ఉం డదు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉం డడంతో నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్, భీమాల ఎత్తిపోతల ద్వారా మూడు లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నది. జూరాలకు జలకళ రావడంతో ముందస్తుగా వ్యవసాయాని కి మంచి రోజులు వచ్చాయని వానకాలం సాగు కు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. జూరాల ముందస్తుగా మురిపెంతో అన్నదాతలు ఆనందంతో సాగుకు సై అంటున్నారు.