జడ్చర్లటౌన్, మార్చి24 : తెలిసి..తెలియని వయస్సు కలిగిన చిన్నారులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుక అద్దం లేకుండానే నడిపించటంపై చర్చనీయాంశమైంది. సోమవారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డ ప్రధాన రహదారి మీదుగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వెనుక భాగంలో అద్దం లేకుండానే వెళ్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉన్న ది.
విద్యార్థులు ప్రయాణించే బస్సుకు వెనుక అద్దం లేకపోతే ప్రమాదమని తెలిసినా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా బస్సును నడిపిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల బస్సులపై నిఘా పెట్టి ప్ర మాదకరంగా ఉన్న బస్సులను గురించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమా దం జరిగిన తర్వాత స్పందించడం కంటే సంబంధిత అధికారులు ముందస్తుగా స్పందిస్తే ప్రమాదాలకు గురికాకుండా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు.