మహబూబ్‌నగర్, నవంబర్ 12 : మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏకైక ప్రైవేట్ మెడికల్ కళాశాల, దవాఖాన కావడంతో ఉమ్మడి జిల్లాకు చెంది న రోగులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి వస్తున్నా.. ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కేసుల్లో ప్రభుత్వం నుంచి డబ్బు లు సరిగా రావడం లేదని శస్త్రచికిత్సకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న దవాఖానకు వ చ్చాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయిందని, కానీ ఆపరేషన్ చేయాలంటే ముం దు యాంజియోగ్రాం చేయాలని, ఆ తర్వాతే ఆపరేషన్ చేస్తామని 24 గంటలు దవాఖానలో పెట్టుకొని యాం జియోగ్రామ్ పరీక్షలు చేసిన తర్వాత అతడికి మూడు స్టంట్లు ఉన్నాయని, చాలా బ్లాక్‌లు ఉన్నాయని రోగి బంధువులను బెదిరించి హైదరాబాద్‌కు తీసుకువెళ్లమని రెఫర్ చేశారు. అయితే తీరా హైదరాబాద్లోనిదవాఖాన పరీక్షలు చే సి ఒక స్టంట్ వేసి ప్రాణాలు కాపాడారు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో అనారోగ్యంతో వనపర్తి జిల్లా పెబ్బేర్‌కు చెందిన ఉప్పరి గంగమ్మ (55)కు గుండె సమస్య ఉందని చెప్పారు. వారు ప్రైవేట్ కళాశాల అండ్ దవాఖానకు తీసుకువచ్చారు. అక్కడ పరీక్షించిన గుండె సంబంధిత వైద్యుడు రెండు స్టంట్లు వే యాలని వెంటనే వేయాలని లేకపోతే క ష్టం మవుతుందని చెప్పారు. అయితే వారు ఆరోగ్యశ్రీలో చేరండి సార్ అని చెప్పారు. ఆమెకు రెండు స్టంట్లు గుం డెకు వేయాలని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అయితే రెండు రోజుల తర్వా త మళ్లీ ఆమెకు పక్షవాతం కూడా ఉంది.
కాబట్టి ఇక్కడ చేయలేమని హైదరాబాద్‌కు తీసుకెళ్లమని హడావుడి చేశారు. ఆరోగ్యశ్రీ కేసులో ఉంది కదా దానిని రద్దు చేస్తామని చెప్పారు. అయితే ముం దుగా దవాఖానలో ఉన్న బిల్లులు కట్టాలని ఆదేశించారు. వారు మా దగ్గర డబ్బులు లేవు . ఆరోగ్య శ్రీలో చేశామని చెప్పి ఇప్పుడు డబ్బులు కట్టాలంటే ఎట్లా కట్టాలని ఆవేదన చెందారు. మొ త్తానికి కొంత డబ్బులు కట్టిన తర్వాత రోగిని హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ క్ర మంలో ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను తీసుకొని హైదరాబాద్‌లోని ఉస్మానియా ద వాఖానకు తీసుకెళ్తేంటే మార్గమధ్యంలో ఆ మహిళ మృతి చెందిందని కుమారుడు శ్రీనివాస్ తెలిపారు.