ఎరువు ధరవు!
రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఏడాది ఏడాది ఎరువుల ధరలను కంపెనీలు పెంచుతూ పోతున్నాయి.
- రైతుకు బరువెక్కిన ఎరువులు
- ఎరువు ఒక బస్తాపై రూ.200 నుంచి రూ.400 వరకు పెంపు
- సాగుపై సందిగ్ధం.. వానకాలం ఆగమాగం
- నియంత్రణలో చేతులెత్తేసిన కేంద్రం
- మండిపడుతున్న అన్నదాతలు
గద్వాల, మే 22 : రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నా, ఎరువుల ధరలు మాత్రం పెంచుతూ పోతుండంతో పేద రైతుకు ఎరువుల ధరలు బరువెక్కుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఏడాది ఏడాది ఎరువుల ధరలను కంపెనీలు పెంచుతూ పోతున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందించలేని ప్రభుత్వాలు ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువుల కంపెనీలు ధరలు పెంచడంతో ధరల పెంపుపై రైతులు మండిపడుతున్నారు.ఎరువుల బస్తాను బట్టి ఒక్కో బస్తాపై రూ.200మొదలు,రూ.400 వరకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయకపోవడంతో పంట పండించుకోవడానికి ఆసాములు వద్ద అప్పులు తెచ్చుకున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పంట చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే 25రోజులైనా ధా న్యం కొనుగోలు చేయడంలే దు. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఇటువం టి పరిస్థితుల్లో ఎరువుల కంపెనీలు యుద్ధం ప్రభావం, ముడిసరుకుల దిగుమతిపై సుంకాలు, రవాణా చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం ఇతర పన్నులను చూయిస్తూ ధరలను కంపెనీలు పెంచడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మా రింది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై కేంద్రం ఎరువుల ధర లు పెంచి రైతులపై మరోభారం వేయడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు. వానకాలం సాగు చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో రైతన్నలు ఉన్నారు.
ఎరువుల వినియోగం ఇలా..
జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో 3.21లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తా రు. ఆ పంటల అవసర నిమిత్తం వివిధ కాంప్లెక్స్ ఎరువులు రైతులు వినియోగిస్తారు. జిల్లాలో రై తులు ఈ వానకాలంలో సాగు చేసే పంటలకు అన్ని ఎరువులతో కలుపుకొంటే 1,18,586 మె ట్రిక్ టన్నుల ఎరువులు అవ సరమవుతాయి. అ యితే పెరిగిన ఎరువుల ధరలు రైతులను మ రింత కుంగదీస్తున్నాయి. ఎరువుల ధరలకు రెక్క లు రావడంతో ఎలా కొనుగోలు చేయాలనే ఆలోచనలతో రైతన్న మదనపడుతున్నారు. అయితే సీజన్ మొదలయ్యే వరకు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎరువులు విక్రయించే దుకాణదారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభ సమయంలో పెరిగిన ధరలను చూసి రైతులు ఆందోళన చెందే అవకాశం ఉంది.ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరువుల ధరలను నియంత్రించి వానకాలం సీజన్ కాలం నాటికి రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఎరువుల ధరలు పెంచడం దారుణం
ఎరువుల కంపెనీలు ధ రలు పెంచడం దారు ణం. కంపెనీలు ప్రతి ఏడాది సీజన్లో ఎరు వుల ధరలు పెంచుతు న్నా కేంద్రం ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతుంది. రైతులకు మద్ద తు ధర మాత్రం వంద లోపు పెంచుతూ ఎరువుల ధరలు మాత్రం కంపెనీలు వందల్లో పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. మద్దతు ధర పెంచకుండా ఎరువుల ధరలు మాత్రం విపరీతంగా పెంచుతున్నారు. పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
– చంద్ర, ఉప్పల, జోగుళాంబ గద్వాల
ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి..
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు పెరిగిన ఎరువుల ధరలను నియంత్రించి ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి. సాగులో రైతులు అధికంగా వినియోగించే 20-20-0-13 రకం ఎరువు ధర బస్తాకు ఏకంగా రూ.400 పెంచడం దారుణం. రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు వ్యవసాయం చేయాల వద్దా అనే పరిస్థితి ప్రస్తుతం కేంద్రం,రాష్ట్రంలో దాపురించింది. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు అండగా నిలవకుండా కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
– ధనుంజయగౌడ్, చిన్నతాండ్రపాడు

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- DAP
- farmers
- fertilizer
- paddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

