ప్రసవ వేదన.. డెలివరీ చేయడంలో డాక్టర్, నర్సుల నిర్లక్ష్యం
కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి కు టుంబీకులు, బంధువుల కథనం మేరకు.. పదరకు చెందిన చాట్ల మం జుల(25)కు తొమ్మిది నెలలు నిం డడంతో కాన్పు కోసం కుటుంబసభ్యులు అచ్చంపేట దవాఖానకు బుధవారం తీసుకొచ్చారు
- నార్మల్ డెలివరీ కావాల్సి ఉండగా.. సిజేరియన్ దాకా..
- అయినా దక్కని శిశువు ప్రాణాలు
- గర్భిణికి చిత్రహింసలు
- అచ్చంపేట దవాఖాన వద్ద కుటుంబీకుల ఆందోళన
- వైద్యశాలను తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ జేడీ
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 27 : కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి కు టుంబీకులు, బంధువుల కథనం మేరకు.. పదరకు చెందిన చాట్ల మం జుల(25)కు తొమ్మిది నెలలు నిం డడంతో కాన్పు కోసం కుటుంబసభ్యులు అచ్చంపేట దవాఖానకు బుధవారం తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడున్న డాక్టర్లు, వై ద్య సిబ్బంది ప్రసవం చేయకుండా కాలయాపన చేశారు. దీంతో నార్మల్ డెలివరీ కావాల్సి ఉన్నా సిజేరియన్ చేసే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ స్రవంతి సకాలంలో రాకపోడంతో అక్కడే విధు ల్లో ఉన్న నర్సులే ఆపరేషన్ చేయడానికి యత్నించా రు. ఈ సమయంలో గర్భిణి కడుపుపై గట్టిగా నొక్క డం.. శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులు పెట్టార ని గర్భిణి బంధువు ఆరోపించారు.
ఈ క్రమంలోనే శి శువు కడుపులోనే మృతి చెందిందన్నారు. విషయం తెలుసుకున్న మంజుల బంధువులు, కుటుంబసభ్యు లు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. వాకి పలు పార్టీల నాయకులు కూడా మద్దతు తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే కొంతకాలంగా చాలామంది పే దలకు, గర్భిణులకు సరైన వైద్యం అందడం లేదని, ఎ న్నో ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న అమ్రాబాద్, అచ్చంపేట సీఐలు ఆదిరెడ్డి, అనుదీప్ దవాఖాన వద్దకు చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా డీసీహెచ్ రమేశ్‌చంద్రను వివరణ కోరగా నిర్లక్ష్యం వహించిన డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
దవాఖాన సందర్శన
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 27 : శిశువు మృతితోపాటు గర్భిణిని వైద్య సిబ్బంది హింసించిన ఘటనపై విచారణ కోసం తెలంగాణ వైద్యవిధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ గురువారం దవాఖానకు వచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, పలు పార్టీలు, ప్రజాసంఘాల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించారు. మంజులతోపాటు ఆమె అమ్మమ్మ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నార్మల్ డెలివరీకి సహకరించలేదని సిబ్బంది తనను కొట్టినట్లు డైరెక్టర్‌కు మంజుల తెలిపింది. బాధితులకు న్యాయం చేస్తామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

