Pregnant Woman | నారాయణపేట : అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించిన ఘటన మద్దూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. చెన్నారెడ్డిపల్లికి చెందిన టీ అనితకు మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఇక అంబులెన్స్‌లో గర్భిణిని తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే పండంటి మగబిడ్డకు అనిత జన్మనిచ్చింది. ఈఎంటీ మహేశ్, పైలట్ మాణికప్ప ఆమెకు పురుడు పోశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీబిడ్డను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇక అనితకు పురుడు పోసిన 108 సిబ్బందిని డాక్టర్లు అభినందించారు.