ఊట్కూర్ : విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ప్రమీల ఫౌండేషన్ ( Prameela Foundation ) వ్యవస్థాపకులు డాక్టర్ కోరం మహేష్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని వల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రీని (Educational materials ) పంపిణీ చేశారు.
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు కోరం గోవర్ధన్, గ్రామ పెద్దలు మన్నె రాజు, చంద్రశేఖర్, ఉపాధ్యాయ బృందం శశిధర్ రెడ్డి ,సత్యపాల్ ,ఇందిరా దేవి, అంగన్వాడీ టీచర్స్ శిరీష, సావిత్రి, ప్రమీల ఫౌండేషన్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.