నారాయణపేట, సెప్టెంబర్ 15 : నారాయణపేట జిల్లాలోని రోడ్లెక్కితే ఒళ్లు హూనమవుతోంది. గతుకులు.. బురద రోడ్లపై ముందుకు వెళ్లాలంటే ని త్యం సాహసం చేయాల్సిందే.. అది జిల్లా కేంద్రమై నా.. మండల కేంద్రమైనా.. గ్రామాలు, తండాలైనా ఇదే దుస్థితి.. వర్షాకాలం వస్తే పరిస్థితి కడు దయనీ యం. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించి నా ఎలాంటి ప్రయోజనం లేదని జిల్లా ప్రజలు అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే నారాయణపేట జిల్లాలోని మండలా ల్లో రూ.143.35 కోట్లతో చేపట్టనున్న 12 పనుల కు నిధులు మంజూరై.. టెండర్లు కూడా పూర్తయ్యా యి. పేట నియోజకవర్గంలోని ధన్వాడ మండలం లో రూ.13 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆర్అండ్బీ అధికారులు, 14 పనులకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. పేట -హైదరాబాద్ రోడ్డు నుంచి 3 కి.మీ. లోపలికి వెళ్లే అం త్వార్, బోయినపల్లి నుంచి తండాకు వెళ్లే రోడ్డుపై కంకర వేసి వదిలేశారు.
అయ్యవారిపల్లికి మట్టి రోడ్డే గతి.. కొల్లంపల్లి స్టేజీ నుంచి వెళ్లే రోడ్డు, మరికల్-ఆత్మకూరు రహదారి గుంతలమయంగా మారింది. ఆత్మకూరు- చిత్తనూరు దారి అధ్వానంగా మారిం ది. ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి-కొత్తపల్లి, దామరగిద్ద-పిడంపల్లి రోడ్డు నుంచి అయ్యవారిపల్లికి రోడ్డు సౌకర్యమే లేదు. కానుకుర్తి-ఆశన్పల్లి రోడ్డు గుంతలమయమైంది. మక్తల్ మండలం కా ట్రేపల్లీ, గుర్లపల్లి, వనాయకుంట, దాసర్దొడ్డి, తిరుమలాపూర్, ముష్టిపల్లి-అనుగొండ, టేకులపల్లి, మ దనపల్లి, జవలాపురం, మక్తల్-వాడ్వాట్, మక్తల్-పర్మన్దొడ్డి, గుర్లపల్లి-సంగంబండ, నర్సిరెడ్డిపల్లి గ్రా మాలకు మట్టిరోడ్లే దిక్కయ్యాయి.
ఊటూర్ మం డలం వల్లంపల్లి, పేట రోడ్డు 3 కి.మీ. అధ్వానంగా మారింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మగ్దుంపూర్-ఎరగట్పల్లి, జీ ర్ణహళ్లి, పెద్దజట్రం, నిడుగుర్తి వయా పెద్దజట్రం, బి జ్వారం-కొత్తపల్లికి, కొత్తపల్లి-ధన్వాడకు రోడ్డు సౌకర్యమే లేదు. చిన్నపొర్ల నుంచి ఎడవెల్లి, పులిమామి డి గ్రామాలది అదే పరిస్థితి. బాపురం నుంచి నిడుగుర్తి రోడ్డులో పాదచారులు సైతం అడుగు తీసి అ డుగు వేయలేని దుస్థితి. మాగనూరు మండలంలో హైవేను అనుసరించి ఉన్న వడ్వాట్ స్టేజీ నుంచి మందిపల్లి వరకు 20 కి.మీ. రోడ్డుపై బీటీపోయి గుంతలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
మాగనూ రు నుంచి వరూర్, నేరడగం, ఉజ్జెలి వరకు 20 కి.మీ. బీటీది ఇదే దుస్థితి. కృష్ణ మండలం గుడెబల్లూరు నుంచి ముడుమాల్ వరకు, టైరోడ్ నుంచి మురహరిదొడ్డి, కుసుమూర్తి నుంచి ఎసేపల్లి, చే గుంట నుంచి ఐనాపూర్ వరకు, కృష్ణ నుంచి గురజాల రోడ్డుపై ప్రయాణికులు అవస్థలు పడుతున్నా రు. కొత్తపల్లి మండలం మహబూబ్నగర్-మద్దూ రు ప్రధాన రహదారిలో లింగాల్చేడ్ నుంచి మద్దూ రు రోడ్డు గతుకులుగా మారింది. మద్దూరు-రెనివట్ల-రాళ్లబాయి వరకు మట్టిరోడ్డు బురదమయంగా మారింది. గుండుమల్-పగిడ్యాల మట్టి రోడ్డులో నూ గ్రామస్తులకు అవస్థలే.. కోస్గి మండలం తోగాపూర్-పందిర హనుమాన్లకు మట్టిరోడ్డుతో తిప్పలే.