తిమ్మాజిపేట, మే 18 : గ్రామస్తులకు ఉచితంగా శుద్ధ నీటిని ఇచ్చేందుకు దాత సాయంతో ఏర్పాట్లు చేశారు.. ఈ నీళ్లు ప్రజలకు అందకుం డా అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం తిమ్మాజిపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పోతిరెడ్డిపల్లి సర్పం చ్, వార్డు సభ్యులతో సహా స్థానికులు ఆందోళన చేపట్టారు. మాకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇ వ్వాలంటూ అంటూ ఖాళీ బిందెలతో ధర్నా చేశా రు. గ్రామంలో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్, వా ర్డు సభ్యులు స్వీప్ చేయడంతో కాంగ్రెస్ నాయకులకు కంటగింపుగా మారిందన్నారు.
గ్రామానికి చెందిన దాత ముందుకు రావడంతో గ్రామ పంచాయతీ వద్ద వాటర్ ప్లాంట్‌కు ఏర్పా ట్లు చేశామని, అంతకు ముందే గ్రామ పంచాయతీ తీర్మానం చేశామని, ఈ విషయం మండ ల, జిల్లా అధికారులకు తెలిపినా అధికార పార్టీ నాయకుల మాటాలకు వత్తాసు పలుకుతూ అ క్కడ పెట్టొదంటూ అడ్డుకుంటున్నారని సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ తీర్మానం చేసినా అపుతారా, పోలీసులను పంపి అడ్డకుంటారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ముఖ్యనేత ద్వారా జిల్లా అధికారికి ఫోన్ చేయించి ప్లాంట్ ఏర్పాటు చేయకుండా అడ్డకుంటున్నారన్నారు. మంచినీళ్లు ఇస్తుంటే కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ గెలిస్తే తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ ధర్నాకు మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల స ర్పంచులు వారికి మద్దతిచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో రాములునాయక్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అన్ని సరిగ్గానే ఉన్నాయని, కానీ ఉన్నతాధికారి నుంచి పదేపదే ఫోన్లు వస్తున్నాయని, ఇది పెద్ద సమస్యగా కొందరు చేస్తున్నారని, తా ము నిస్సహాయులమని వాపోయారు. రెండుగంటల పాటు ఆందోళన కొనసాగగా చివరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో అనుమతి తీసుకొని ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో వారి కి సూచించారు.
ఇదిలా ఉండగా సాయంత్రం పోతిరెడ్డిపల్లిలో ప్లాంట్ ప్రారంభిస్తారన్న సమాచారంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుం డా పోలీసులు బందోబ స్తు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్‌రెడ్డి, తిమ్మాజిపే ట ఎస్సైలు శ్రీనివాస్‌రా వు, శ్రీనివాసులు, సి బ్బంది గ్రామస్తులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్లాంట్ మూసినేస్తామని పం చాయతీ కార్యదర్శి వారికి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హుస్సేని, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, వేణుగోపాల్‌గౌడ్, వెంకటస్వామి ఉన్నారు.