మహబూబ్నగర్, అక్టోబర్ 7 : దసరా సెలవులు వచ్చాయి.. ఊర్లు, విహారయాత్రలు, బంధువుల ఇండ్లకు కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి.. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడే అవకాశం ఉంటుంది.ఇండ్ల భద్రత మరచిపోవద్దని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. అందుకని తప్పనిసరిగా కుటుంబంతో సహా వెళ్లాల్సి వస్తే.. సమీపంలోని పోలీస్స్టేషన్లో వివరాలు చెప్పండి.. వారు మీ ఇంటికి భద్రత కల్పించే వీలుంటుంది. ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, నగదు వెంట తీసుకెళ్లడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు.
దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు ఇంట్లో విలువైన వ స్తువులను పెట్టొదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే పోలీసులకు స మాచారం ఇవ్వాలి. లేదంటే నగలు, నగదును లాకర్లో భద్రపర్చుకోవాలి. డబ్బు, నగలు దొంగతనం అయ్యాక బాధపడేకంటే.. ముందే జాగ్రత్తలు తీసుకుం టే నష్టాన్ని నివారించుకోవచ్చు. పెద్ద మొత్తం నగదుతో కార్లలో వెళ్లేవారు డ్రైవర్ల గురించి ముందే తెలుసుకోవాలి. కొత్తవారిని నమ్మి ప్రయాణం చేయొద్దు. కాలనీ, ఇండ్లు, అపార్ట్మెంట్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. చోరీలను అరికట్టేందుకు పోలీసుల గస్తీ, పెట్రోలింగ్ బృందాలను పెం చాం. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే డయల్ 100 కు సమాచారం అందించాలి. చోరీల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.
– డీ జానకి, ఎస్పీ, మహబూబ్నగర్