తిమ్మాజిపేట, ఫిబ్రవరి 4 : తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.
చుట్టుపక్కల వారు గమనించి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. అయితే బాలికను వైద్యపరీక్షల నిమిత్తం నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.