మక్తల్, ఫిబ్రవరి 17: కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లే కుండా వారి పొలాలను లాకోవడానికి పటిష్టమైన పోలీస్ బం దోబస్తుతో సరారు సర్వేకు సిద్ధమైంది. తమ పొలాల్లో తమకు తెలియకుండా సర్వే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన రైతులపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సర్వేను అడ్డుకోవడానికి మీకు ఎలాంటి అధికారం లేదు.. అసలు మీరు రైతులే నా అని ప్రశ్నించి దౌర్జన్యానికి ఒడిగట్టిన ఘటన సోమవారం మక్తల్ మండలం కాట్రేవుపల్లి వద్ద చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 69తో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసేందుకు మక్తల్ మండలంలోని భూత్పూ ర్ రిజర్వాయర్ 1.31 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి టీఎంసీ నీటిని ఎ త్తి పోసుకోవడానికి చేపడుతున్న భూ సేకరణలో భూముల కో ల్పోతున్న రైతులకు ముంద స్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు పోలీస్ ప హారాలో సర్వే మొదలుపెట్టారు. మక్తల్ మం డలం కాట్రేవుపల్లికి చెందిన రైతుల భూమిని ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం భూములన్నీ తీసుకోనేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను రైతులు అ డ్డుకోవాలని చూస్తున్నప్పటికీ రైతులను తమ పొలాల వద్దకు సైతం రానీయకుండగా మక్తల్ సీఐ చం ద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తమ సిబ్బందితో అ డ్డుకుంటూ సర్వే పనులను పూర్తి పోలీస్ పహారాలో కొనసాగేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించిన లీడర్ సర్వేను ఇదివరకే నీటిని తీసుకునే స్థానం నుంచి చివరి పాయింట్ వ రకు సమగ్ర అధ్యయనంతో పూర్తి చేశారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గంలో లక్ష ఎ కరాలకు సాగునీరు అందించేందుకు రేవంత్‌రెడ్డి సరార్ రూ.3,556కోట్ల అంచనాతో ఈ పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. భీమా ఫేజ్ వన్‌లో అంతర్భాగమైన భూత్పూర్ జలాశయం నుంచి నీటి ని తీసుకునేందుకు 2014లో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొడంగల్‌కు నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎత్తిపోతల ప థకం పనులను వేగం పెంచారు. కృష్ణా జలాల నుంచి ఏడు టీఎంసీలను నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో భూసేకరణకు రంగం సిద్ధం చేసింది.
గతంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు 0.9 టీఎంసీల నీటిని ప్రతిపాదించగా, నాలుగు టీఎంసీలకు పెంచారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నారాయణపేట నియోజకవర్గంలోని కా నుకుర్తి వరకు మూడుచోట్ల లిఫ్టు చేసే విధంగా, ప్రాజెక్టును రూపకల్పన చేశారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు మొదటి దశలో మక్తల్ మండలం కాట్రేవుపల్లి వద్ద పంప్‌హౌస్ నిర్మించేందుకు మండలంలోని ఎర్నగానిపల్లి శివారులో 24 ఎకరాలు, కాట్రేవుపల్లి శి వారులో 31ఎకరాలు పంప్ హౌస్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశా రు.
ఈ పంప్‌హౌస్ నుంచి మక్తల్ నియోజకవర్గంలోని ఊ టూర్ మండలం జయమ్మ చెరువుతోపాటు కాన్కుర్తి చెరువు ఆధునీకరణ చేసేందుకు నీటి నిల్వ పెంచేవిధంగా మొదటి దశ పనులకు రు.2,945కోట్లను ప్రభుత్వం రచించింది. ఎత్తిపోతల పథకం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడానికి సిద్ధమయ్యారు. ఎత్తిపోతల పథకానికి కావాల్సిన భూమిని సేకరించే పనిలో హద్దులు వేస్తుండడంతో రైతులు పంటలు పండించుకునే పచ్చటి పొలాలను మాకు తెలియకుండానే లాకునేవిధంగా అధికారుల వ్యవహారం ఉందని ఆవేదన చెందుతున్నారు.
మా భూమి ఎంత పోతున్నది కనీసం వివరాలన్నా.. చెప్పండని అధికారులను మొరపెట్టుకోవడానికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకొని అధికారుల దగ్గరకు రానివ్వకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరై ఆవేదన చెందాల్సిన పరిస్థితి త లెత్తింది. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ మిని కోల్పోతున్న రైతులకు కనీసం భూమి కొంత పరిధిలోకి వె ళ్తుందని చెప్పే అధికారులు లేకపోవడంతో రైతులు ఏం చేయాలో తోచక దీనస్థితిలో ఉండాల్సిన పరిస్థితి తమకు వచ్చిందని వాపోతున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు అధికారులు ఎలాంటి సమాచారం అందించకుండా తమ పొలాల్లోకి రావడానికి జీర్ణించుకోలేక ఒక యువరైతు, సర్వే నిలిపివేయాలని అధికారులను విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో పురుగుల మందు డబ్బా తీసుకొని సర్వే చేస్తున్న అధికారుల దగ్గరకు వెళ్తుండగా.. మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి అడ్డగించి అధికారుల దగ్గరకు వెళ్లనీయకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. మూకుమ్మడిగా రైతులందరూ తమకు తెలియకుండా సర్వే చేయరాదని పట్టుబట్టడంతో సీఐ చంద్రశేఖర్ మక్తల్ తాసీల్దార్ సతీశ్‌కుమార్‌కు సమాచారం అందించారు. తాసీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఏ ఒక రైతుకు తెలియకుండా భూమిని మాత్రం తీసుకోమని, ప్రస్తుతం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏ రైతుకు చెందిన భూమి ఎంత పోతుందో అంచనా వేయడానికి సర్వే చేస్తున్నామని.. ఇది ఫైనల్ సర్వే కాదని సూచించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే రైతులకు పూర్తిస్థాయిలో వివరాలు అందిస్తామని తెలిపారు.
పోలీస్ పహారాలో కొనసాగిన సర్వే..
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు మక్తల్ మండలం కాట్రేవుపల్లి వద్ద మొదటి దశ పంప్‌హౌస్ నిర్మాణం, భూసేకరణకు అధికారులు చేస్తున్న సర్వే భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. సర్వే ప్రక్రియను నారాయణపేట డీఎస్పీ లింగయ్య పరిశీలించి, రైతులను ఎవరినీ సర్వే చేస్తున్న అధికారుల దగ్గరకు వెళ్లనీయకుండా నివారించారు. ఏదైనా బాధ కలిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన మాకు పోలీస్ వాళ్లే రైతులను అడ్డగించి సర్వే చేయడానికి సహకారం చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.