బల్మూరు, మే 24 : ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగానే సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు అడ్డుకునే అవకాశం ఉన్నదన్న అనుమానంతో పలువురిని నిర్బంధించారు. తెల్లవారుజామునే 15 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో ఉప్పునుంతల స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకొన్న బ ల్మూరు, మైలారం, అనంతవరం, అంబగిరి గ్రామ రై తులు, ప్రజలు 400 మంది నమాజ్ గడ్డ నుంచి ర్యా లీగా బల్మూరులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అరె స్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదించారు. ప్రాజెక్టులో భూములు పో తే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకొన్న అచ్చంపేట సీఐ రవీందర్, బల్మూరు ఎస్సై రమాదేవి, పలువురు ఎస్సైలు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు రైతులంతా శాంతియుతంగా రావాలని కోరారు.
ఇందుకు ససేమిరా అనడంతో.. స్పందించిన పోలీసులు రోడ్లపై నిరసన తెలియజేయొద్దని సూచించారు. దీంతో రైతులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ప్రారంభమైన సదస్సుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారన్న విషయం తెలుసుకున్న నిర్వాసితులు మళ్లీ రోడ్డుపై వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టయిన రైతులను పోలీసులు విడుదల చేసి బల్మూరుకు తీసుకొచ్చారు. గుమిగూడిన రైతలంతా ర్యాలీగా సదస్సుకు వద్దకు వెళ్లారు. అక్కడ తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఎమ్మెల్యేకు, ఇరిగేషన్ అధికారులకు అందజేశారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టును వెంటనే ఆ పాలని, రుసూల్, మై లారం చెరువులను ఒక్క టీఎంసీ రిజర్వాయర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఎకరా పొలానికి పరిహారంగా రూ.30 ల క్షలు, కుటుంబంలో ఉద్యో గం ఇవ్వాలని సభ దృష్టికి తీ సుకొచ్చారు. కూర్చోవడానికి కు ర్చీలు వేసినా.. నిలబడి సదస్సులో ఎమ్మెల్యే, అధికారుల ప్రసంగాన్ని వింటుండగా.. ఎమ్మెల్యేకు తాము అందించిన డిమాండ్లు సదస్సులో చదవకపోవడం అసహనం తెలిపారు. అక్కడే నేలపై కూ ర్చొని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు స్పందన లేకపోవడంతో నాలుగు గ్రామాలకు చెందిన 300 మంది రై తులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. కేవలం కొందరితో సదస్సును ముగించేశారు. బల్మూరు మండలంలోని దాదాపు 800 ఎకరాలను రైతులు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్నారు. దీంతో రిజర్వాయర్ నిర్మాణానికి ససేమిరా అంటున్నారు.
ఆలస్యంగా సదస్సు.. రైతుల ఆగ్రహం
ఉమామహేశ్వర ప్రాజెక్టుపై బల్మూరులో నిర్వహించిన అవగాహన సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అధికారుల తీరుపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగానే ప్రకటించినట్లు శనివారం ఉదయం 10 గంటలకు షురూ కావాల్సిన సభ మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైంది. అంత వరకు రైతులెవరూ సదస్సుకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణతోపాటు అదనపు కలెక్టర్ అరుణారెడ్డి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో రైతులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సు కాదు.. కాంగ్రెస్ పార్టీ సమావేశం
అధికారులు ఉమా మహేశ్వర ప్రాజెక్ట్ స్టేజ్-1 భూసేకరణ రైతుల అవగాహన సదస్సు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారని భూనిర్వాసితులు సీతారాంరెడ్డి, బాలస్వామి, శంకర్, రాజు, తిరుపతయ్య, వెంకట్‌స్వామి ఆరోపించారు . మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను తెల్లవారక ముందే అరెస్టు చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు తరలించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రైతు అవగాహన సదస్సులో భూములు కోల్పోతున్న అనంతవరం, బల్మూరు, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన రైతులతో అభిపాయ్ర సేకరణ చేసి చేయాలన్నారు. కాని అందుకు విరుద్ధంగా అధికారులు, ఎమ్మెల్యేతో కలిసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజమైన రైతులను అధికారులు, ఎమ్మెల్యే అవమానపరిచారని వారు అవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు వినకుండా పోలీసులతో బయటకు పంపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలని రైతులు కోరారు.
రైతులను అరెస్టు చేసి నేలపై కూర్చోబెట్టి
ఉప్పునుంతల, మే 24 : బల్మూర్ మండలంలోని అనంతవరం, బల్మూర్ గ్రామాలకు చెందిన కొంతమంది రైతులను శనివారం ముందస్తు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బల్మూర్ మండలం కొండనాగుల శివారులో నూతనంగా నిర్మించతలపెట్టిన ఉమా మహేశ్వర ప్రాజెక్టు ముంపు రైతులు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభను అడ్డుకునేందుకు రైతులు వెళ్తున్నారని పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ చేసిన రైతులను నేరస్తులాగా ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌లో నెలపై కూర్చోబెట్టి అవమానపరిచారు. ఈ ఘటనపై పలువురు పోలీసుల తీరును తప్పుపట్టారు.