ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 24 : పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్ల లీవ్ మాన్యూవల్ ప్రకా రం తమ భర్తలు నెలకు ఒకసారి ఇంటికి వస్తారని, ఇప్పటి వరకు 15రోజులకు ఒకసారి వచ్చేవారని, ఇ దే కష్టంగా ఉందనుకుంటే మళ్లీ పాతపద్ధతి అమల్లోకి వస్తున్నదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారాలకు వారాలు తమ భర్తలు డ్యూటీ పరంగా కుటుంబానికి దూరం కావడంతో కుటుంబంలో చిన్నపిల్లలతోపా టు తమకు అత్యవసర పరిస్థితులు వచ్చినా అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ డ్యూటీల కారణంగా కుటుంబ కలహాలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఎస్పీ బెటాలియన్స్‌లో జరుగుతున్న వెట్టి చాకిరిని నిర్మూలించాలని మొత్తంగా ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ అనే వ్యవస్థను అమలు చేయాలని వారు డిమాం డ్ చేశారు. పదోపటాలంలో గద్వాల డీఎస్పీ సత్యనారాయణ, పదో పటాలం కమాండెంట్ సాంబయ్య పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యు ల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అయితే పోలీసు సిబ్బంది ధ ర్నా కారణంగా జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ఇటిక్యాల, కోదండాపూర్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.