జడ్చర్ల టౌన్, జూన్ 8 : అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఎమ్మెల్యే తీరు ఉన్నదన్నారు.
అందుకే వెంటనే అతడిని అరెస్టు చేయడంతోపాటు ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ముస్లిం జేఏసీ నాయకులు మహ్మద్ సుల్తాన్చిష్టి మీర్జాయి, మహ్మద్ గౌస్మొహియోద్దీన్, యాసర్, బాబా, సియాదత్అలీ, అజహరొద్దీన్ ఉన్నారు.