బీజేపీ మరోసారి ఎన్నికల స్టంట్‌కు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు అనవసర హంగామాతో హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో జనాదరణ పొందాలని ఎత్తులేశారు. ఈ క్రమంలో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధాని మోదీ రానున్నారు. భూత్పూరు సమీపంలో బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేశారు. అయితే ఈ పర్యటనలో రూ.13,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్ విధానంలో చేస్తున్నా.. ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం చేకూరే ఒక్క పని అందులో లేకపోవడం కొసమెరుపు. గత ఎన్నికల సమయంలోనూ పాలమూరుకు వచ్చి హామీలు గుప్పించినా నేటికీ అ మలుకు నోచుకోలేదు. దీంతో ‘ఆయా రామ్.. గయా రామ్’.. అన్నట్లు ఉ న్న ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి మళ్లీ వస్తున్నారన్న వార్త తప్పా.. ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. గ తంలో పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చి వి స్మరించగా.. ఈసారి ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ప్రజ లు, రైతుల నుంచి వినిపిస్తున్నది. కృష్ణా జలాల్లోనూ నీటి వాటా తేల్చకుంటే ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ పర్యటన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆదివారం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ వేదికగా రూ.13,500 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ పనుల్లో ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలేవీ లేకపోవడం ఆరోపణలకు తావిస్తున్నది. కేవలం ఎన్నికల వేళ బీజేపీ నేతలు హడావిడి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారనే తప్పా ప్రజాప్రయోజనాలు పట్టడం లేదని అంటున్నారు. ఈసారి మోదీ ఉమ్మడి జిల్లా కరువును శాశ్వతంగా పోగొట్టే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ప్రకటించకపోతే ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.
జీవనది కృష్ణమ్మ జిల్లాలో పారుతున్నా న్యాయంగా రావాల్సిన నీటి వాటా దక్కకుండా అన్యాయం చేస్తున్నారని ప్రజలు మండిపడ్తున్నారు. 2014, 2018 ఎన్నికల ముందు ఇదే విధంగా పాలమూరుకు వచ్చిన మోదీ జిల్లా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే హామీలు ఇవ్వకపోవడంతో ఓటర్లు డిపాజిట్లు గల్లంతు చేశారు. ఈసారి కూడా ప్రధాని వస్తున్నారన్న మాటే తప్పా.. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నేతలు మరోసారి రిక్తహస్తం చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోసపడ్డ పాలమూరుకు సాగు, తాగునీళ్లు, పేద ప్రజల కు ప్రధాని ఆవాస్ యోజన, తెలంగాణ వచ్చాక పట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులు సమకూర్చే ఏ పథకానికి మోదీ శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయకపోవడంతో ప్రజలు మండిపడ్తున్నారు.
పేరు గొప్ప.. పనుల దిబ్బ
ప్రధాని పేరు చెప్పుకొని పట్టణాల్లో బీజేపీ నేతలు హంగామా చేయడం తప్పా ఈ జిల్లాకు చేసిందేమీ లేదు. న్యాయంగా రావాల్సిన నీటి వాటా.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాపై దమ్ముంటే ప్రకటనలు చేయించాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్టానికి, జిల్లాకు మోదీ చేస్తున్న మోసాన్ని మంత్రి కేటీఆర్ వనపర్తిలో తీవ్ర స్థాయిలో ఎండగట్టిన విషయం తెలిసిందే.. ఏ చిన్న అవకాశం దొరికినా తెలంగాణపై విషం చిమ్మే మోదీపై పాలమూరు గడ్డపై పాదంమోపే అర్హత లేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కొనలేని కేంద్రం అసమర్థతను బయటపెట్టడానికి మోదీ వస్తున్నారా? అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు వేదికగా జాతీయ హోదా..కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోతే మోదీని.. ఆ పార్టీ భరతం పడుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాగా ప్రధాని పర్యటనకు అనేక ఆంక్షలు విధించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అయితే సభకు రావాలని ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఏం చేశాడని మోదీ సభకు రావాలని కొందరైతే నిలదీస్తున్నారు.
ఎన్నికల స్టంట్..
ప్రధాని మోదీ పర్యటన ఎన్నికల స్టంట్‌గా మారింది. గతంలో వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల సమయాలలో కూడా ఆయన పర్యటించారు. క రువు, వలసలతో అల్లాడిన పాలమూరు కు ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. కేవలం ఇక్కడ ఎన్నికల టూరిస్టులాగా వచ్చిపోవడం తప్పా ఆయన వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదనే విమర్శలు వస్తున్నాయి. భారీ హంగామాతో రావడం.. వెళ్ల డం తప్పా ఈ జిల్లాకు ఒరగబెట్టిందేమీ అదని అన్ని పార్టీ లు నిలదీస్తున్నాయి. బీజేపీ నేత లు కూడా మోదీ జపం చే స్తున్నా.. ఆ పార్టీ నేతలెవ్వరూ జిల్లా సమస్యలను ప్రస్తావించలేకపోతున్నారు. ఆయా రామ్.. గయా రామ్.. అన్నట్లు మోదీ పర్యటన తయారైందని ఆపార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ జిల్లాకు ఏం తేలేకపోతున్నామని లోలోపల మదన పడుతున్నారట. స్వచ్ఛ భారత్ మురుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్ కొంతమందికే తప్పా ఏం ఇవ్వలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. చేసింది చెప్పుకోవడానికి ఒక్క పని కూడ తొమ్మిదిన్నర ఏండ్లలో చేయలేదని, నేడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడగాలని బీజేపీ నేతలే అంటున్నారట. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధిలో పోటీపడుతూ.. పాలమూరు జిల్లా రూపురేఖలనే మార్చేశారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా ప్రకటించాల్సిందే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని ఉమ్మడి జిల్లా ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వలసలు, ఆకలి చావులు, సాగునీరు లేక గోస పడ్డ నాటి జిల్లాకు కృష్ణానది జలాలను తరలించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు మోదీ అంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో రాగానే ఇస్తామని ప్రకటించినా.. తర్వాత దాని ఊసే ఎత్తడం లేదు. అధికారంలో వచ్చి తొమ్మిదిన్నర ఏండ్లయినా జాతీయ హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారో ప్రజలకు వివరించాలని జిల్లాకు చెందిన మేధావులు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ముందు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. పాలమూరుకు ఎందుకు ఇవ్వరని ఇక్కడి రైతులు నిలదీస్తున్నారు. గోస పడ్డ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రా ష్ట్రం ఏర్పాటయ్యాక పాలమూరు ఇప్పుడిప్పుడే కుదుట ప డ్తుందని.. కేంద్రం ఆదుకోవాల్సిందిపోయి రాజకీయం చేయ డం ఏమిటని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. జాతీయ హోదా ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో మోదీకి, బీజేపీకి తగిన బుద్ది చెబుతామని ప్రజలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.
అన్ని పనులు వర్చువల్ విధానంలోనే..