పెద్దమందడి, డిసెంబర్ 29 : విద్యార్థులు సా ధించే విజయాల్లో మానసిక, శారీరక దృఢత్వం కీలకపాత్ర పోషిస్తాయని రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాల యం వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజాప్రభాకర్ పేర్కొ న్నారు. శుక్రవారం మండలంలోని మోజర్ల ఉద్యానవన కళాశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతో అవసరమని, మానసిక ఒత్తిడిలేని చదువుతో విద్యార్థులు మరింత ఎక్కువ చ దువులో రాణిస్తారన్నారు. దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ని తిలకించి క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ విజయ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య, ఎస్టేట్ ఆఫీసర్ నాగేశ్వర్రెడ్డి, ఓఎస్ఏ డా క్టర్ షహనాజ్, డాక్టర్ శంకర్స్వామి, డాక్టర్ గౌ తమి, డాక్టర్ శ్రీనివాస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.