అచ్చంపేట : అచ్చంపేట ( Achchampet ) ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ( CPI ) నాయకులు శుక్రవారం ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రదీప్ రాజుకు వినతి పత్రం ( Petition ) అందించారు. ఆ పార్టీ నియోజకవర్గ సమితి కార్యదర్శి పెర్ముల గోపాల్, తాలూకా నాయకులు ఎస్ మల్లేష్ మాట్లాడుతూ 70 పడకల ఆసుపత్రిలో ఐదుగురు కాంట్రాక్ట్ వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారని, కొత్తగా డాక్టర్లను నియమించాలని కోరారు.
ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని కోరారు. శానిటేషన్లో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారన ఆరోపించారు. ఆసుపత్రిలో లిఫ్టు పనిచేయక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. గర్భిణులకు 3, 9వ నెలలో స్కానింగ్ తీయాలని, ప్రతి మంగళవారంతో పాటు ప్రతి శుక్రవారం కూడా ఆపరేషన్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తాలూకా నాయకురాలు ఎన్ తిరుపతమ్మ, కే భాస్కర్, మాధవి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.