డీఎస్సీలో దివ్యాంగులకు రిజర్వేషన్ల అమలుపై స్టే
డీఎస్సీ 2017 నియామకాలలో దివ్యాంగుల రిజర్వేషన్ల అమలు కు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేసిన సీజే ధర్మాసనం
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ 2017 నియామకాలలో దివ్యాంగుల రిజర్వేషన్ల అమలు కు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దివ్యాంగుల చట్టం ప్రకారం ఖాళీలను సవరించి అర్హతల ఆధారంగా పిటిషనర్ అభ్యర్థులను పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఐదువేలకుపైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి 2017లో జారీచేసిన నోటిఫికేషన్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలుచేసిన విధానాన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్గౌడ్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి రిజర్వేషన్లను సవరించాల ని ఆదేశాలు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలుపై చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లు పెండింగ్లో ఉండగా వాటితో జతచేసి సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

