మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లా కేం ద్రంలోని రామ్‌మందిర్ చౌరస్తా సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది. టంకరకు చెందిన దా సు(42) వారం పదిరోజులుగా విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది సూచనల మేరకు మహబూబ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలు తొలగిస్తున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఉదయం రాంమందిర్ చౌరస్తా సమీపంలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు, కొమ్మలు తొలగిస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో దాసు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఈ ప్రమాద ఘటనలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. చెట్టు కొట్టే వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎలా ఎక్కుతాడని.. ఈ విషయంలో సంబంధిత అధికారుల అలసత్వం స్పష్టంగా కళ్లకు కడుతుందన్నారు. చెట్టు కొట్టే ఇంటికి సమీపంలో ఉ న్న విద్యుత్ స్తంభానికి రెండు రకాల విద్యుత్ లైన్లు ఉన్నాయని తెలిపారు. ఒక్కదానికే అధికారులు ఎల్ సీ తీసుకున్నారా..? లేకా రెండు లైన్లకు ఎల్సీ తీసుకున్నారా.? అనే దానిపై స్పష్టత లేదు. కేవలం అధికారులు సమీపంలోని ఇంటి యజమాని ఇన్వర్టర్ ఫెయిల్ అయ్యిందనే కారణాన్ని మాత్రమే చూపుతున్నా.. పెద్దలైన్ ఎల్సీ ఏ సమయంలో తీసుకున్నారు.? ప్రమాదం జరిగాక ఫోన్ ద్వారా లైన్బంద్ చేయించారా.? అనేది తెలియాల్సి ఉంది.
ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తూ తాము విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండొద్దనే లక్ష్యంతోనే పట్టణంలో ట్రీకటింగ్ కార్యక్రమం 15 రోజులుగా నిర్వహిస్తున్నామని తెలిపా రు. రాంమందిర్ వద్ద ఓ వ్యక్తి ఇంటి ఎదుట స్తం భం పక్కనే చెట్టు ఉండంతో ఎల్సీ తీసుకుని చెట్టు, కొమ్మలు కొట్టిస్తున్నామన్నారు. ఇంట్లో ఉన్న ఇన్వర్టర్కు ఎర్తింగ్ లేకపోవడంతో విద్యుత్ రిటర్న్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.
బాధిత కు టుంబ సభ్యులకు శాఖ తరఫున చట్ట పరిధిలో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద వి షయం తెలిసిన మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ అప్పయ్య ఘటనా స్థలానికి చేరుకుని తన సిబ్బందితో వివరాలు సేకరించారు. భారీ సంఖ్యలో గుమిగూడిన జనాన్ని కంట్రోల్ చేస్తూ అక్కడ్నుంచి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రి(పెద్ద దవాఖాన)కి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు దవాఖాన వద్ద తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.