కేటీదొడ్డి, అక్టోబర్ 26: గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 60 ఏండ్లు కష్టాలు అనుభవించామని, మళ్లీ తమకు ఓటేయాలని గ్రామాలకు వస్తున్నారని, వారి మాటలు నమ్మితే మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపురం, పాగుంట, ఈర్లబండ, పాతపాలెం, మైలగడ్డ, రంగాపురం, గంగన్పల్లి గ్రామాల్లో పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకొద్దు.. మీరు కూడా ఆ పాలనను కోరుకోవద్దు అంటూ కర్ణాటక రాష్ట్ర ప్రజ లు రెండ్రోజుల ముందు గద్వాలలో ధర్నా చేశారన్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏం చేయడానికి చేతకావడం లేదని, తెలంగాణలో ఏం చేస్తారని ప్రశ్నించారు. వారికి పదవులు కావాలని, ప్రజల బాధలు అవసరం లేదన్నారు. ప్రజలంతా ఆలోచించి ఒక్కటిగా బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటెయ్యాలన్నారు. ఇంతమంది ప్రజలు వస్తారని ఊహించలేదన్నారు. మీ అభిమానానికి ఋణపడి ఉంటానని చెప్పారు.
ఎమ్మెల్యే బండ్ల ఎన్నికల ప్రచారానికి కేటీదొడ్డి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. సుమారు 200కార్లు, 800 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వినియోగదారుల చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, ధరూర్, కేటీదొడ్డి జెడ్పీటీసీలు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్, గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, వైఎస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, కేటీదొడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, స్థానిక సర్పంచు ఆంజనేయులు, గోపి, గోపాల్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, హనుమంతు, టీచర్ గోవిందు, యుగేంధర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీగా బీఆర్ఎస్లోకి వస్తున్నారని, ఇక నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలుగ్రామాల పర్యటనలో భాగంగా గద్వాల మండలంలోని పూడూరు, మదనపల్లి, మల్దకల్ మండలంలోని విఠలాపురం, గట్టు మండలం నుంచి గంగిమాన్‌దొడ్డి, ఇందువాసి, కేటీదొడ్డి మండలం నుంచి వెంకటాపురం గ్రామాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ మాజీ ఎంపీటీసీ నరేందర్, మాజీ సింగిల్‌విండో డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నక్క వెంకటేశ్, ఆనంద్, రాజు, శివకృష్ణ, సంజు, రవికుమార్, సుధాకర్, రాఘవేంద్ర, రాముడు, వీరేశ్, నవీన్, రాకేశ్, భరత్, రాముడు, రాఘవేంద్ర, నర్సింములు, కావలి సోకన్న, పెద్ద నర్సింహులు, రంగస్వామి, తాయప్ప, లక్ష్మన్న, తిమ్మప్ప, గోకరి, పెద్ద బడేసాబ్, హరిజన నర్సింహులు, మెకానిక్ పరశురాముడు, ఇస్మాయిల్, మాజీ సర్పంచు కర్రెప్ప, హనుమంతునాయుడు, మూల రఫీక్, మాజీ ఎంపీటీసీ రాముడు, నాయుడు, అరుణ్, భాస్కర్, గోపి, తిమ్మప్ప, మదిరెడ్డి ఎల్లప్ప, చంద్రన్న, కురువ చిన్నకృష్ణ, శ్రీను, బెండకాయ శేఖర్, నర్సింహులు, రవి, సాకలి శ్రీను, చెన్నయ్య, దుళ్ల య్య, రాముడు, నాగన్న, హనుమంతు, తిమ్మప్ప, నరేశ్, నర్సింహులు, నరేశ్ తిమ్మప్ప, గట్టు నాగన్న నర్సింహులు, నాగరాజు, వీరేశ్, ఆంజనేయులు, గోపి, స్వామి, అంజి, ప్రకాశ్, నర్సింహులు, వెంటక్రాములు, మల్లేశ్, రంగస్వా మి, సుధాకర్, రాజు, పాండు, ఆటో పాండు, ఆంజనేయు లు, రంగస్వామి పార్టీలో చేరారు.
ధరూరు, అక్టోబర్ 26: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యమని మండల వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ధరూరుకు ఎమ్మెల్యే చేరుకోగానే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాగుంట ఆలయ కమిటీ చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్, విజయ్, భీంరెడ్డి, ఎంపీటీసీ రఘురెడ్డి, భీంరెడ్డి, అబ్రహం, రామన్న, రాజారెడ్డి, వెంకటేశ్నాయుడు, విజయభాస్కర్‌రెడ్డి, మహెబుబ్, దౌలన్న, సుధాకర్‌రెడ్డి, కుర్వ శ్రీనివాసులు, మండల యూత్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు భరత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్స్మాట్, చక్రధర్‌రెడ్డి, మోనేష్ మారోజు ఉన్నారు.
గద్వాల రూరల్, అక్టోబర్ 26: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు గురువారం ఉదయం నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని జములమ్మ, పరశురామస్వామిని దర్శించుకొన్నారు. అలాగే గోనుపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.