ప్రతిపక్షాలకు పొరపాటున ఓటేస్తే ఆగమైతమని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. సోమవారం మాజీ మం త్రి చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని రాంమందిర్చౌర స్తా, పాన్‌చౌరస్తా, క్లాక్‌టవర్ చౌరస్తా, రామయ్యబౌళిలో మంత్రి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో మహబూబ్‌నగర్ పట్టణంలో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు మిషన్ భగీరథ పుణ్యమా అని రోజూ తాగునీళ్లు వ స్తున్నాయన్నారు. ఐటీ టవర్ వద్ద ఏర్పా టు చేయనున్న పరిశ్రమలతో యు వతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ స్తాయన్నారు. పదేండ్లలో చేసిన అభివృద్ధిపై పుస్తకం రూపొందించామని, తనకంటే ముందు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి రెండున్నరేండ్ల పాలనపై పుస్తకాన్ని తయారు చేయగలడా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పైసా పనిచేయని నాయకులు మోసపూరిత మాటలతో అయోమయానికి గురిచేస్తున్నారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 13 : మహబూబ్‌నగర్‌లో పదేండ్లలో చేపట్టి అభివృద్ధి వల్లే వ్యాపారాలు ఎన్నోరెట్లు పెరిగాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని రామ్మందిర్చౌరస్తా, పాన్‌చౌరస్తా, క్లాక్‌టవర్ చౌరస్తా వద్ద ప్రతి దుకాణానికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మంత్రికి ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది. అనంతరం క్లాక్‌టవర్ వద్ద కార్నర్ మీటింగ్ ద్యారా మంత్రి మాట్లాడారు. ఒకపు్పుడు తాగునీటి కూడా తీవ్రంగా కష్టాలు పడిన మహబూబ్‌నగర్ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. హైదరాబాద్ తరహా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళాశాలను మన వద్ద ఏర్పాటు చేసుకున్నామని, ఫలితంగా వైద్యరంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ఒకపు్పుడు కాటన్‌మిల్ ద్యారా స్థానికులకు ఉద్యోగ అవకాశలు లభించేవని, మిల్లు మూతపడిన తర్వాత సమస్యలు ఏర్పడ్డాయన్నారు. నేడు ఐటీ టవర్, అమర్‌రాజా లిథియం గిగా పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. పదేండ్లలో చే సిన అభివృద్ధిపై పు స్తకం రూపొందించామని, తనకంటే ముం దు ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి తన రెండున్నరేండ్ల పాలనపై పుస్తకాన్ని ప్రజలకు అందించగలరా అని ప్రశ్నించారు. కులం, మతం అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు కూడా ట్రిక్కులు మరోసారి ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన అభివృద్ధి చూసి వివిధ పార్టీల్లో ఉన్న మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్ వంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడి అభివృద్ధిని చూసి దుబాయ్, అమెరికా నుంచి వచ్చి ఎన్నికల్లో మద్దతు తెలిపి ప్రచారం చేస్తున్నారని వివరించారు.
అధికారంలో ఉన్నప్పుడు పైసా పనిచేయని నాయకులు అబద్ధపు, మోసపూరిత మాటలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రం అదోగతి పాలవుతుందన్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి పైపులను కూడా అమ్మేస్తారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇదే ఒరవడి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రామయ్యబౌలిలో బీఆర్ఎస్ నేత సయ్యద్ ఇబ్రహీంతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే హనుమాన్‌పుర, జమ్ములమ్మనగర్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్ కోరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, లయన్స్ క్లబ్ చైర్మన్ నటరాజ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్లు వేదావ్రత్, ముస్తాక్ రషీద్, షేక్ఉమర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, నరేందర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.