నారాయణపేట, ఆగస్టు 3 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తకు నడక నేర్పుతున్నాయి. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం నారాయణపేట జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. స్కీమ్ ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ మొదటి విడుతలో మంజూరైన ఇళ్లలో కేవలం పావువంతు మాత్రమే పూర్తయ్యాయి. మిగితా నిర్మాణాలు అసంపూర్తిగా మిగలడం ప్రభుత్వాన్ని ఆందోళన గురిచేస్తోంది. బిల్లుల కోసం వేలాది మంది లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరికొందరు బయట అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా? అని ఆశగా నిరీక్షిస్తున్నారు.
ఒకో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుండడంతో అవి ఒక ఇల్లు పూర్తి కావడానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. పరిపూర్ణ స్థాయిలో ఒక ఇల్లు పూర్తి కావడానికి తప్పని సరిగా రూ.12 లక్షల నుంచి 15లక్షల వ్యయం అవుతుండడంతో తప్పని సరి గా మిగతా డబ్బుల కోసం లబ్ధిదారుడు అప్పు చే యాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇందిర మ్మ ఇళ్లు మంజూరు అయిన ప్రతి లబ్ధిదారుడు అ ప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప నుల పురోగతి నెమ్మదిగా ఉండడంతో పథకం లక్ష్యం దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి, నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మొదటి విడుతలో జిల్లాకు మొత్తం 6,526 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 1,748 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే దాదాపు 25 శాతం ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లన్నీ వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 981 ఇళ్లు బేస్ లెవెల్ ఉండగా, 460 ఇళ్లు రెంటల్ స్థాయిలో, 1689 ఇళ్లు రూఫ్ లెవెల్ వద్ద ఉన్నాయి. ఇంకా అనేక ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లలోనే జీవనం కొనసాగించాల్సి వస్తోంది.
పూర్తయిన ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.125 కోట్ల 10 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇంకా రూ.19 కోట్ల 20 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. ఈ నిధులు అందకపోవడంతో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాయి. మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.
గత రెండేళ్లలో సిమెంట్, ఇనుము, ఇసుక, ఇటుక, కంకర, కూలీల వేతనాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం మాత్రమే సరిపోకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ప్రైవేట్ గా అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. బిల్లులు ఆలస్యమవుతుండటంతో అప్పులపై వడ్డీ భారం కూడా పెరుగుతోందని పలువురు లబ్ధి దారులు ఆందోళన చెందుతున్నారు.
ఇళ్ల నిర్మాణం మందగమనానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. దశలవారీగా నిధుల విడుదల ఆలస్యం, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, కూలీల కొరత వంటి పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సహాయానికి రెండింతల ఖర్చు పెట్టాల్సి వస్తుం ది. అలా పెడితే తప్పా ఇంటి నిర్మా ణం పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కొంతమంది లబ్ధిదారులు సొంతంగా నిధులు స మకూర్చుకోలేక పనులను మ ధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాలో కొంత మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యిందన్న సంతో షం ఎక్కువ సేపు నిలవలేదు. ఇళ్లు మ ంజూరైంది. చేతిలో మంజూరు పత్రం కూడా ఉన్నదని, ఉన్న పాత ఇంటిని కూల్చి ఇళ్లు నిర్మించుకునేందుకు బేస్మేట్ వేసుకున్న తర్వాత ‘చావు కబురు చల్లగా చెప్పినట్లు’గా నిబంధనల మేరకు మీ బేస్మెంట్ లేదని.. ఇందిరమ్మ పథకం మీకు వర్తించదని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఒ క్కసారికిగా షాక్కు గురైన పరిస్థితులు జిల్లాలో చా లా చోట్ల చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
నా భార్య మంజుల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు చెబితే నిర్మాణం పనులు చేపట్టాను. బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్నాను. కానీ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బేస్మెంట్ లేదని ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు. నాకు సొంత ఇల్లు లేకపోవడంతో నెలకు రూ.2 వేలు చెల్లించి కిరాయి ఇంట్లో ఉంటున్నాను. పేద కుటుంబానికి తనకు ఇంటి నిర్మాణం కోసం బిల్లు ఇస్తే బాగుంటుంది.
– చాకలి గోపి, కంచుకోట వీధి, ధన్వాడ మండలం
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. ఇళ్లు మంజూరు చేశాక కొంత మంది లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవడంతో వాటిని రద్దు చేసి కొత్త వారికి మంజూరు చేశాం. స్థలం సరిపోకపోవడం, డబ్బులు లేకపోవడం, కూలీల కొరత తదితర కారణాలతో ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తున్నాం.
– శంకర్, హౌసింగ్శాఖ పీడీ, నారాయణపేట జిల్లా