ఖిల్లాఘణపురం, అక్టోబర్ 4: మండలంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తున్నది. మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామ శివారులో చిరుత అడుగు జాడలు కపినించడంతో గ్రామస్తులు వామ్మో పులి అని భయాందోళనకు గురవుతున్నారు.
ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అధికారులు అడుగు జాడలు గుర్తించి చిరుత సంచరిస్తుందని గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా జాగ్రత్తలు ఉండాలని ఆదేశించారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ధన్వాడ, అక్టోబర్ 4 : చిరుత దాడిలో జింక మృతిచెందిన ఘటన ధన్వాడ మండలంలోని మందిపల్లి గ్రామం లో గురువారం రాత్రి చోటు చేసుకున్నది. రైతుల కథనం మేరకు గ్రామంలో చిరుత సంచరిస్తూ వారం రోజుల వ్యవధిలో కొడే, గొర్రెలపై దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయం అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతు లు వాపోయారు. మందిపల్లిలో బోన్ ను ఏర్పాటు చేసి చిరుత నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.