కోస్గి, ఆగస్టు 20 : పేదల భూములను లాక్కోవడమేనా కాంగ్రెస్ ప్రజా పాలననా అంటే అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవా రం ఆయన కోస్గి మండలంలోని సర్జఖాన్‌పేట గ్రామంలో పర్యటించి మాట్లాడారు. ఓ పేద కుటుంబానికి చెందిన దంపతులు తమ ఇంటి స్థలాన్ని కాంగ్రెస్ నేతలు అక్రమంగా కబ్జా చేశారన్న విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన మా ట్లాడుతూ ఎవరు లేని దంపతుల స్థలాన్ని కబ్జా చేయడమేంటని, సీఎం ఇలాకాలో ఇ లాంటి పాలననా ప్రజలు కోరుకున్నది అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని గెలిపిస్తే మీరేమో వారిని దోచుకోవడం మొదలు పెట్టారు. మేము కమ్యూనిటీ భవనానికి వ్యతిరేకం కాదు అలాగని పేద ప్రజ ల స్థలాల్ని కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం ఇలాకా కాబట్టి ఆ దంపతులకు వేరే దగ్గర స్థలం చూపించి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే గ్రామానికి చేరుకోగానే ప్రజలంతా ఆయన వెంట నడిచారు. కాంగ్రెస్‌ని నమ్మి మోసాపోయామని ఆయన వద్ద మొరపెట్టుకున్నారు.మీ అందరికీ బీఆర్ఎస్ పార్ట్టీ అం డగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం భరోసా ఇచ్చారు. అనం తరం గుండుమాల్ మండలం కొ మ్మూరు లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీటీసీ లక్ష్మి రాఖి కట్టి స్వీటు తినిపించారు.