మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 11 : మహబూబ్‌నగర్ రీజినల్ పరిధిలోని ప్రయాణికులకు ఆ ర్టీసీ సంస్థ శనివారం చుక్కలు చూపించింది. సం క్రాంతి పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. బ స్సులు లేక ప్రయాణికులు పిల్లపాపలతో పడిగాపు లు కాస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి వివిధ రూట్లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ బస్సులను రెగ్యులర్‌తో పాటు ప్రతేక బస్సులను నడిపిస్తున్నది. ప్రత్యేక బస్సులకు టికెట్ చార్జీలు ఒక్కసారిగా 50శాతం పెంచేసింది. సూపర్‌లగ్జరి, గరుఢ బస్సులకు ఆన్లై న్ చెల్లింపుల్లో ప్రతి టికెట్‌పై అదనపు చార్జీలు వసూ లు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బర్కత్‌పుర డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులు కండక్టర్ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, రాయిచూర్ రూట్లో ఎక్కువగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రధానంగా కోస్గి, షాద్‌నగర్, నవాబ్‌పేట్ వంటి పట్టణాలకు బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కనీసం ఐదారు గంటలు బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తుంది.
హైదరాబాద్ డిపో నుంచి వచ్చే స్పెషల్ బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనన్నారు. ఇతర డిపో నుంచి వచ్చే బస్సు లు ప్రయాణికులతో నిండుగా వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ప్రయాణికులు తక్కువగా ఉండటం వల్ల అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలానే ఉంటుందన్నారు. రె గ్యులర్ బస్సుకు మాత్రం పా త చార్జీలే వసూలు చేస్తున్నామన్నారు. బస్సులకు ఎలాం టి కొరత లేదని జడ్చర్ల, బా లానగర్ వద్ద ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఉదయం నుంచి మహబూబ్‌నగర్, హైదరాబా ద్ రూట్లో బస్సులు కొంత అలస్యంగా నడుస్తున్నాయన్నారు.
– సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్